ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేటీఆర్ ఖమ్మం టూర్ వాయిదా- కారణం ఇదేనా : పార్టీ ప్లీనరీ ఈ సారి ప్రత్యేకంగా..!!

|
Google Oneindia TeluguNews

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మంత్రి తారక రామారావు ఖమ్మం పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం రేపు (సోమవారం) అయన ఖమ్మంలో పర్యటించాల్సి ఉండగా.. దానిని వాయిదా వేసుకున్నారు. ఈ - కామర్స్ పైన ఏర్పాటు చేసిన పార్లమెంట్ కమిటీ సమావేశంతో పాటు, తెలంగాణ ప్రభుత్వ స్పేస్ టెక్ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమాల నేపథ్యంలో ఖమ్మం పర్యటనను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మంలో సాయి గణేష్‌ అనే బీజేపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేయడం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందడం.. ఈ నేపథ్యంలో.. మంత్రి పువ్వాడ అజయ్‌, పోలీసులపై బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ- కామర్స్ పైన ఏర్పాటు చేసిన పార్లమెంట్ కమిటీ సమావేశం పాటు, తెలంగాణ ప్రభుత్వ స్పేస్ టెక్ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఒకటి, రెండు రోజుల్లో కేటీఆర్ ఖమ్మం పర్యటన ఉంటుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ హైటెక్స్‌లో నిర్వ‌హించ‌నున్న టీఆర్ఎస్ ప్లీన‌రీ ఏర్పాట్ల‌ను పరిశీలించారు. తెలంగాణ ఆత్మ‌గౌర‌వం, అస్థిత్వానికి ప్ర‌తీక‌గా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుక‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్ప‌డి 21 ఏండ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా, హెచ్ఐఐసీలో ప్ర‌తినిధుల మ‌హాస‌భ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

Minister KTR Khammam Tour postponed, here the details

రేపు (సోమవారం) మ‌ధ్యాహ్నం జీహెచ్ఎంసీ నాయ‌కుల‌తో స‌మావేశం నిర్వ‌హిస్తామని..ప్లీనరీ నిర్వహణా ఏర్పాట్లు పైన చర్చిస్తామని చెప్పారు. ఆవిర్భావ దినోత్స‌వానికి 3 వేల మంది హాజ‌రు కానున్న‌ట్లు వెల్లడించారు. ఆహ్వానాలు అందిన‌వారే స‌భ‌కు రావాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. స‌భ‌కు వ‌చ్చే వారికి పాసులు జారీ చేస్తామ‌ని కేటీఆర్ చెప్పుకొచ్చారు. నిర్వ‌హిస్తామ‌న్నారు. గ్రామ శాఖ‌ల అధ్య‌క్షులు టీఆర్ఎస్ జెండాల‌ను ఆవిష్క‌రించాల‌ని నిర్దేశించారు. 3,600 చోట్ల ప‌ట్ట‌ణాల్లో జెండా ఆవిష్క‌ర‌ణ చేయాల‌ని కేటీఆర్ సూచించారు.

English summary
Minister KTR Khammam Tour post poned due to govt programmes, visited Party pleneary venue and given key directions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X