రానా! ఇప్పుడైనా ప్రభాస్‌కు చెప్పండి: మంత్రి కెటిఆర్ మాటైనా వింటారా?
హైదరాబాద్: రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండే తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు మిగతా విషయాలపై కూడా అంతే ప్రత్యేక శ్రద్ద చూపిస్తారు. బాహుబలి సినిమాకు జాతీయ అవార్డు దక్కడంపై స్పందించిన కేటిఆర్.. చిత్ర దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ, నటీనటులు ప్రభాస్, రానా , తమన్నాలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
అంతేగాక, రానాకు సరదాగా ఓ సలహా కూడా ఇచ్చారు మంత్రి కెటిఆర్. బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇమేజ్ ఖండాంతరాలు దాటింది. ఇన్నాళ్లు టాలీవుడ్‌కే పరిమితమైన ప్రభాస్ బాహుబలితో బాలీవుడ్‌లో ప్రవేశించాడు. ఇక అక్కడ ఇక్కడ ఈ హీరోకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

ఈ క్రమంలో ప్రభాస్ అప్డేట్స్ ఫాలో అయ్యేందుకు అభిమానులు ఉత్సుకత చూపించడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఇటీవల తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాను తెరిచి తన విషయాలను అప్డేట్ చేస్తున్నారు. అయితే, ప్రభాస్‌కు ట్విట్టర్ ఎకౌంట్ లేకపోవడంతో కెటిఆర్.. రానాకు ఓ సరదా ట్వీట్ చేశారు.
'రానా బాబు .. ముందు ప్రభాస్‌ని ట్విట్టర్‌లోకి తీసుకురా' అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై బాహుబలి నిర్మాతలతో పాటు పలువురు సరదా కామెంట్స్ చేస్తున్నారు. మరి మంత్రి కెటిఆర్ సూచనతో మన బాహుబలి ట్విట్టర్ ఖాతా తెరుస్తారా? లేదా అనేది చూడాలి.
Kudos to Team Bahubali on winning the national award @ssrajamouli @RanaDaggubati @Shobu_ @tamannaahspeaks
— KTR (@KTRTRS) March 29, 2016
P.s:Rana, Get Prabhas on Twitter












Click it and Unblock the Notifications