Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నమో అంటే నమ్మించి మోసం..మోడీజీ.. వాటిపై శ్వేతపత్రం విడుదల చెయ్యండి: మంత్రి కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ భారత ప్రధాని నరేంద్ర మోడీ పై, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక పథకాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాజాగా మోడీకి బహిరంగ లేఖ రాసిన కేటీఆర్, ఆ లేఖలో మోడీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజ్ గార్ మేళా పచ్చి దగా అని పేర్కొన్న కేటీఆర్ యువతను మరోసారి మోసం చేయడం కోసం దీన్ని తీసుకువచ్చారని ఆరోపించారు. నమో అంటే నమ్మించి మోసం చేసే వాడని రుజువైందని మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

నిరుద్యోగ సమస్యపై మోడీ నిబద్దతతో పని చెయ్యటం లేదు

నిరుద్యోగ సమస్యపై మోడీ నిబద్దతతో పని చెయ్యటం లేదు


ప్రధాని మోడీ నిబద్ధతతో నిరుద్యోగ సమస్యపై పని చేయడం లేదని పేర్కొన్న మంత్రి కేటీఆర్, ప్రతి ఎన్నికలకు ముందు యువతను మోసం చేసేటువంటి కార్యక్రమాలను పక్కన పెట్టాలని, నిరుద్యోగ సమస్యపై నిబద్ధత తో దృష్టిసారించాలని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలకు ముందు మోడీ మరో కొత్త డ్రామాకు తెరతీశారు అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు నింపుతామని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతున్నారని, మరి 16 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది అంటూ నిలదీశారు.

రోజ్ గార్ ప్రచారం నిరుద్యోగ యువత పై మీరు చేస్తున్న క్రూర పరిహాసమే

రోజ్ గార్ ప్రచారం నిరుద్యోగ యువత పై మీరు చేస్తున్న క్రూర పరిహాసమే


మీ బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు. రోజ్ గార్ మేళా పేరుతో కేవలం 75 వేల మందికి నియామక పత్రాలు అందజేయడాన్ని దేశ నిరుద్యోగులు గమనిస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. 75 వేల ఉద్యోగాల పేరుతో మీరు చేస్తున్న రోజ్ గార్ ప్రచారం నిరుద్యోగ యువత పై మీరు చేస్తున్న క్రూర పరిహాసమేనని మంత్రి కేటీఆర్ విమర్శించారు. దేశంలో లక్షల నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే కేవలం వేలల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తారా అని ప్రశ్నించారు.

ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేయాలని చూస్తే తిరుగుబాటు తధ్యం

ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేయాలని చూస్తే తిరుగుబాటు తధ్యం

ఒక్క తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల 24 వేల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు సుమారు 16.5 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రైవేట్ రంగాల్లో కల్పిస్తున్నామని పేర్కొన్న మంత్రి కేటీఆర్, ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఇన్ని ఉద్యోగాలు కేటాయిస్తే, దేశంలో కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న మీరు దేశ యువతకు ఇంకెన్ని ఉద్యోగాలు కేటాయించాలి అంటూ ప్రశ్నించారు. నిరుద్యోగుల ఉద్యోగ కల్పనలో మోడీ ప్రభుత్వం విఫలమైందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రతిసారి మాదిరిగా ఈసారి కూడా ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేయాలని ప్రయత్నిస్తే మీ పాలన పై, మీ ప్రభుత్వం పై తిరగబడే రోజు వస్తుందని మోడీని కేటీఆర్ హెచ్చరించారు.

మీరెప్పుడు రాజీనామా చేస్తారు మోడీజీ.. ప్రశ్నించిన మంత్రి కేటీఆర్

మీరెప్పుడు రాజీనామా చేస్తారు మోడీజీ.. ప్రశ్నించిన మంత్రి కేటీఆర్


అంతకుముందు కూడా ప్రధాని మోడీ పై కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వివిధ ఆర్థిక విధానాలకు బాధ్యత వహిస్తూ బ్రిటన్ ప్రధాని కేవలం 45 రోజుల్లో రాజీనామా చేశారని, మరి మీరెప్పుడు బాధ్యత వహిస్తారు అంటూ మోడీని ప్రశ్నించిన ఆయన, మోడీ రాజీనామా చెయ్యాలని మండిపడ్డారు. దేశంలోని ద్రవ్యోల్బణ పరిస్థితులను, నిరుద్యోగ సమస్యలను, రూపాయి పతనాన్ని, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను టార్గెట్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+