అదేమైనా నీ సామ్రాజ్యమా? టీఆర్ఎస్ కార్పొరేటర్ల తీరుపై మంత్రి కేటీఆర్ గరం.. గరం..

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: నగరంలో కార్పొరేటర్లతో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు శనివారం నిర్వహించిన సమావేశం గరం.. గరంగా సాగింది. ఈ సమావేశంలో కేటీఆర్ కొంతమంది కార్పొరేటర్లకు వార్నింగ్ కూడా ఇచ్చారు.

పనితీరు మార్చుకోకుంటే పరిమాణాలు చాలా తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా చైతన్యపురి, హయత్‌నగర్‌ కార్పొరేటర్లకు కేటీఆర్‌ సమావేశంలో చురకలంటించారు.

minister-ktr

చైతన్యపురి నీ సామ్రాజ్యం అనుకుంటున్నావా ? అంటూ ఆ డివిజన్ కార్పొరేటర్ ను కేటీఆర్ వ్యంగ్యంగా ప్రశ్నించారు. అధికారులు మీ డివిజన్‌లలో తిరిగాలంటే నీ అనుమతి తీసుకోవాలా? అంటూ నిలదీశారు. అంతేకాదు, ప్రవర్తన ఇలాగే ఉంటే పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తానంటూ హెచ్చరించారు.

సినిమాలో నటించావా.. అని హయత్‌ నగర్‌ కార్పొరేటర్‌ తిరుమల్‌ రెడ్డికి కూడా వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ వెంగళరావు నగర్‌ కార్పొరేటర్‌ కిలారి మనోహర్‌.. 'కాఫీ విత్‌ కార్పొరేటర్‌' ప్రోగ్రాంను ప్రముఖంగా ప్రస్తావించారు.

పార్టీకి కార్పొరేటర్లు కీలకమని, ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం పద్దతి కాదన్నారు. అందరూ కలిసి జాగ్రత్తగా పని చేయాలని సూచించారు. అధికారుల వెంట పడి పని చేయించుకోవాలని, వారేమైనా ఇబ్బంది పెడితే తనకు చెప్పాలని కోరారు. వినూత్నంగా పని చేసి జనంలోకి వెళ్లాలంటూ మంత్రి కేటీఆర్‌ సలహా ఇచ్చారు. 

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Municipal and IT Minister of Telangana State K.Taraka Rama Rao fired on some of the GHMC Corporators here in Hyderabad on Saturday. KTR also warned Chaitanyapuri, Hayat Nagar Corporators.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి