హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏం చెప్పారు?: కేటీఆర్ ‘ఆపిల్’ మ్యాప్స్ ప్రసంగ వీడియోకు భారీ స్పందన

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో యాపిల్ మ్యాప్స్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన ప్రసంగానికి సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది. మంత్రి కేటీఆర్ తన ప్రసంగాన్ని ఫేస్‌బుక్‌లోని వ్యక్తిగత ఖాతాలో ఉంచగా 2,420, 170 మంది వీక్షించారు.

2.47 నిమిషాల నిడివి ఉన్న ఈ ఈ వీడియోకి 42K లైక్స్ రాగా, 2.7K కామెంట్లు రావడం విశేషం. ఈ వివరాలన్నీ సోమవారం మధ్యాహ్నాం మూడున్నర గంటల ప్రాంతంలోనమోదైనవి. ఈ వీడియోని అనేకమంది ఈ ప్రసంగాన్ని షేర్ చేయడం, కామెంట్లు పెట్టడం, స్మైలీలు పంచుకోవడం చేశారు. వీక్షకుల సంఖ్య గంటగంటకూ శరవేగంగా పెరుగుతుండటం విశేషం.

Minister KTR Speaks at Inauguration of Apple Maps Development Centre In Hyderabad

ఇదిలా ఉంటే ఈ వీడియోకు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు భారీ సంఖ్యలో స్పందించడం విశేషం. కాగా, ఇలాంటి మంత్రి మాకూ ఉంటే బాగుండేదని కొందరు, కొద్ది రోజులు మా రాష్ట్రానికి పంపాలని మరికొందరు, కేటీఆర్‌ను కలుస్తానంటూ గుజరాత్ ఇన్నోవేషన్ సొసైటీ చైర్మన్ సునీల్ షా కామెంట్ చేశారు.

యాపిల్ లాంటి టెక్నాలజీ దిగ్గజం తన డెవలప్‌మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిందంటే అది మంత్రి కేటీఆర్ ఘనతేనని మరికొందరు అభిప్రాయపడ్డారు. తమిళనాడుకు చెందిన రవీంద్రనాథ అనే వ్యక్త్తి.. తమ రాష్ట్రంలో ఏర్పాటయ్యే నూతన ప్రభుత్వంలో కొత్త ఐటీ మంత్రి కేటీఆర్‌లాగా ఉండాలని ఆకాంక్షించారు.

మా పశ్చిమబెంగాల్ మంత్రుల్లో ఇంత అద్భుతంగా మాట్లాడే వారు ఒక్కరైనా ఉన్నారా? అంటూ ఆ రాష్ర్టానికి చెందిన భావిక శిక్కా అనే నెటిజెన్ కామెంట్ చేశారు. కర్ణాటక ఐటీ మంత్రిగారూ.. నిద్రపోతున్నారా? మేలుకోకపోతే బడా కంపెనీలు హైదరాబాద్‌కు పోతాయి అంటూ కుశాల్ అరలిహల్లీ అనే కర్ణాటక నెటిజెన్ తమ మంత్రిపై అసంతృప్తిని వ్యక్తపరిచారు.

English summary
Minister KTR Speaks at Inauguration of Apple Maps Development Centre In Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X