ట్రాఫిక్‌లో 2 గంటలు చిక్కుకున్న మంత్రి కేటీఆర్: సెల్ఫీలు దిగుతూ.. (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా పోచంపాడులోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునరుజ్జీవ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే.

వైష్ణవాలయం, శివాలయం: ఏపీ-తెలంగాణలపై కేసీఆర్

శంకుస్థాపన, అనంతరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బహిరంగ సభకు వెళ్లే వాహనాలతో ఆ రహదారులన్నీ రద్దీగా మారాయి.

సభాస్థలికి వెళ్లేందుకు మంత్రి కేటీఆర్ ఇబ్బంది పడ్డారు. ఆయన వెళ్తున్న వాహనం అక్కడి ట్రాఫిక్‌లోనే ఇరుక్కుపోయింది.

ఈ పరిస్థితుల్లో చివరకు కేటీఆర్‌ సభాస్థలికి చేరుకోలేకపోయినట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. జనం కేటీఆర్‌‌ను జనాలు గుర్తించి ఆయనతో షేక్‌హ్యాండ్స్‌, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister KTRTRS held up in traffic for 2 hours while in way to public meeting in Pochampad. People happy to shake hands and take selfies.
Please Wait while comments are loading...