Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన.. క్షణం తీరిక లేకుండా.. షెడ్యూల్ ఇలా!!

తెలంగాణ పురపాలక, ఐటీ మంత్రి కేటీఆర్ రేపు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి కేటీఆర్ రేపు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాలు చేయనున్నారు. భారీ బహిరంగ సభలలో పాల్గొననున్నారు. సభలో సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు కేటీఆర్ తన చేతుల మీదుగా సంక్షేమ ఫలాలను అందించనున్నారు. ఇక రేపు మంత్రి కేటీఆర్ పర్యటన షెడ్యూల్ విషయానికి వస్తే

ఉదయం 9:15 నిమిషాలకు కేటీఆర్ హన్మకొండకు చేరుకుంటారు. 9 గంటల 30 నిమిషాలకు లష్కర్ బజారులోని గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉదయం అల్పాహార పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 9 గంటల 45 నిమిషాలకు 100 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఐటీ టవర్ కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బంధం చెరువు వద్ద 26 కోట్లతో చేపట్టిన 15 ఎం ఎల్ డి ఎస్ టి పి పనులను ప్రారంభిస్తారు.

Minister KTR

ఆపై జి డబ్ల్యూ ఎం సి 30 కోట్లతో అభివృద్ధి చేసిన ఎన్ఐటి జంక్షన్ ను ప్రారంభిస్తారు. ఆపై మడికొండలోని ఐటి పార్కును పరిశీలిస్తారు.అనంతరం వడ్డేపల్లి నుండి గోపాల్పూర్ వరకు నిర్మించిన 100 ఫీట్ రోడ్ ను ప్రారంభిస్తారు. ఆపై హన్మకొండలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను ప్రారంభిస్తారు. అనంతరం 12 గంటల నుండి ఒంటిగంట వరకు ఐడిఓసిలో పర్యటిస్తారు.

ఆపై హన్మకొండ హయగ్రీవ చారి గ్రౌండ్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం అలంకార్ జంక్షన్ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఎంఆర్ఐ స్కానింగ్ యూనిట్ ను ప్రారంభిస్తారు. పోతన ట్రాన్స్ ఫర్ స్టేషన్ ను ప్రారంభిస్తారు. పోతన నగర్ లోని మోడ్రన్ ల్యాండ్రోమార్ట్ ప్రారంభిస్తారు. అనంతరం భద్రకాళి ఆర్చి జంక్షన్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు.

భద్రకాళి బండ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ కు శంకుస్థాపన చేస్తారు. స్మార్ట్ సిటీ పనులకు కూడా శంకుస్థాపన చేస్తారు.అనంతరం రీజినల్ లైబ్రరీ సమీపంలో ఉన్న పోలీస్ భరోసా సెంటర్ ను ప్రారంభిస్తారు. వరంగల్ రీజినల్ లైబ్రరీని ప్రారంభిస్తారు. ఆపై మున్నూరు కాపు సంఘం భవనానికి శంకుస్థాపన చేస్తారు.

హనుమకొండ ఆర్టిసి బస్టాండ్ ను ఆధునీకరించే పనులకు శంకుస్థాపన చేస్తారు. పద్మాక్షి రోడ్డులో నిర్మితమైన కేసీఆర్ భవన్ ను ప్రారంభిస్తారు. కెసిఆర్ భవన్ సమీపంలో ల్యాండ్రోమార్ట్ ప్రారంభిస్తారు. ఆపై దూబగుంట లోని డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఖిల్లా వరంగల్ గ్రౌండ్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+