KTR: దుబాయ్‍లో కేటీఆర్.. తెలంగాణకు పలు పెట్టుబడులు..
తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దుబాయ్ లో పర్యటిస్తున్నారు. కేటీఆర్ మంగళవారం దుబాయ్ చెందిన వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధితులతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం పలు కంపెనీలు తెలంగాణలో 1,040 కోట్లకుపైగా పెట్టుబడిలు పెట్టేందుకు ముందుకొచ్చాయి. తెలంగాణ వ్యాపారానికి అనువుగా ఉంటుందని.. హ్యుమన్ సోర్సు కూడా ఎక్కువగా ఉంటుంది కేసీఆర్ చెప్పారు. కేటీఆర్ తో లులూ గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ అలీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది.
సంవత్సరానికి వెయ్యి కోట్ల అక్వా ఉత్పత్తులు తెలంగాణ నుంచి సేకరించేందుకు ఆ సంస్థ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఇందుకోసం కోల్డ్ స్టోరేజీ, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ వంటి వాటిపై పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంది. తమ పెట్టుబడితో 500 మందికి ఉద్యోగాలు వస్తాయని కంపెనీ తెలిపింది. తెలంగాణలో మరింత పెట్టుబడి పెట్టేందుకు మలబార్ సంస్థ ముందుకొచ్చింది. ఇప్పటికే బంగారం రిఫైనరీ రంగంలో తెలంగాణలో ఆ సంస్థ పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు ఫర్నిచర్ తయారి ప్లాంట్ ఏర్పాడు చేయడానికి సిద్ధమైంది.

దాదాపు రూ.125 కోట్ల పెట్టుబడులు పెట్టునున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. తమ పెట్టుబడితో 1000 పైగా ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. ఆ మేరకు కేటీఆర్ మలబార్ బృందం భేటీ అయి పెట్టుబడి పెట్టనున్నట్లు వివరించింది. తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్కో ముందుకొచ్చింది. రాష్ట్రంలో రూ.700 కోట్లతో అగ్నిమాపక సామగ్రి తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. నాఫ్కో కంపెనీ సీఈవో ఖాలిద్ అల్ ఖతీజ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కేటీఆర్‌తో సమావేశం అనంతరం ఈ నిర్ణయం ప్రకటించింది.
న్యాక్‌తో కలిసి అంతర్జాతీయస్థాయి ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలన్న కేటీఆర్ ప్రతిపాదనకు నాఫ్కో ఒకే తెలిపింది. తెలంగాణలో తమ కార్యకలాపాల విస్తరణకు రూ. 215 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రపంచ దిగ్గజ పోర్ట్ ఆపరేటర్ డీపీ వరల్డ్ తెలిపింది. డీపీ వరల్డ్ హైదరాబాద్‌లో తన ఇన్ లాండ్ కంటైనర్ డిపో ఆపరేషన్ కోసం రూ.165 కోట్లు, మేడ్చల్ ప్రాంతంలో 5,000 ప్యాలెట్ కెపాసిటీ కలిగిన కోల్డ్ స్టోరేజ్ వేర్‌హౌస్‌ను రూ.50 కోట్లతో ఏర్పాటు చేస్తామని వివరించింది.












Click it and Unblock the Notifications