కేటీఆర్ బండి సంజయ్ సవాళ్ళ మధ్యలో దూరి.. బండికి మంత్రి మల్లారెడ్డి షాకింగ్ ఛాలెంజ్!!

తెలంగాణ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేస్తూ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ బండి సంజయ్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుండగా, మధ్యలో మంత్రి మల్లారెడ్డి కూడా చేరారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి బండి సంజయ్ ను టార్గెట్ చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు

బండి సంజయ్ కు మంత్రి మల్లారెడ్డి సవాల్

బండి సంజయ్ కు మంత్రి మల్లారెడ్డి సవాల్

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఇతర ఏ రాష్ట్రాలలోనూ జరగలేదని పేర్కొన్న మంత్రి మల్లారెడ్డి రాష్ట్రంలో జరిగినట్టుగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా అభివృద్ధి పథకాలను చూపిస్తే తాను రాజీనామా చేస్తానంటూ బండి సంజయ్ కు సవాల్ విసిరారు. రాష్ట్రంలోనే తెలంగాణ తరహా పథకాలను చూపిస్తే, తన మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ తనని ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని పేర్కొన్న మంత్రి మల్లారెడ్డి రైతులకు కేసీఆర్ ప్రభుత్వం చేసినంత మేలు, మరే ప్రభుత్వం చేయలేదంటూ పేర్కొన్నారు.

కేటీఆర్ కు సవాల్ చేసిన బండి సంజయ్

కేటీఆర్ కు సవాల్ చేసిన బండి సంజయ్


ఇప్పటికే బండి సంజయ్ తెలంగాణ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలైన వారందరికీ డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వాలని, నిరుద్యోగులు అందరికీ ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని.. అలా చేస్తే తాను చెప్పుతో కొట్టుకోవడానికి అయినా, కొట్టించుకోవడానికి అయినా, తల నరక్కోవడానికి అయినా సిద్ధంగా ఉన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.అంతకుముందు డ్రగ్స్ టెస్ట్ కు తాను సిద్ధమని పేర్కొన్న మంత్రి కేటీఆర్ బండి సంజయ్ పై ఘాటుగా వ్యాఖ్యలు చేసి, డ్రగ్స్ టెస్ట్ లో ఏమీ లేదని తేలితే కరీంనగర్ కమాన్ దగ్గర చెప్పుతో కొట్టించుకుంటావా అంటూ బండి సంజయ్ కు సవాల్ విసిరారు.

కేటీఆర్ , బండి సంజయ్ మధ్య మల్లారెడ్డి.. షాకింగ్ సవాల్

కేటీఆర్ , బండి సంజయ్ మధ్య మల్లారెడ్డి.. షాకింగ్ సవాల్


ఇక ఈ క్రమంలోనే బండి సంజయ్ రాష్ట్రంలో ప్రజల సమస్యలను పరిష్కరించాలని, తాను అడిగిన పనులు చేస్తే చెప్పుతో కొట్టించుకోవడానికి సిద్ధమంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి ఈ వ్యవహారంలో దూరి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని, ఒకవేళ అలా ఉన్నట్టు చూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని షాకింగ్ సవాల్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+