సమాధానం చెప్పాక పాదయాత్ర చెయ్యండి; బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు మంత్రి ప్రశ్నలు

తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళనలు నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాదు ఢిల్లీ వేదికగా మహా ధర్నా నిర్వహించి కేంద్రం తీరును ఎండగట్టిన కేసీఆర్ తెలంగాణ రైతాంగం సాగుచేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి రంగంలోకి దిగారు.

దీంతో కేంద్రం రైతులను మోసం చేసినా, తెలంగాణ ప్రభుత్వం రైతులను మోసం చెయ్యదని చెప్పే ప్రయత్నం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇక ఇదే సమయంలో కెసిఆర్ మెడలు వంచి కేసీఆర్ తో తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తున్నామని బీజేపీ నేతలు చెబుతున్నారు.

కిషన్ రెడ్డి, బండి సంజయ్ లపై మండిపడిన మంత్రి నిరంజన్ రెడ్డి

కిషన్ రెడ్డి, బండి సంజయ్ లపై మండిపడిన మంత్రి నిరంజన్ రెడ్డి

తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ల వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. యాసంగి లో తెలంగాణ లో పండే బాయిల్డ్, రా రైస్ ప్రతి గింజా కనిపించే బాధ్యత తనదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పింది నిజం కాదా అంటూ ఆయన ప్రశ్నించారు.

వడ్ల కొనుగోళ్లతో తెలంగాణ ప్రభుత్వానికి ఏం సంబంధం? కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది.. కేంద్రంతో ధాన్యం కొనిపించి బాధ్యత నాది..అని చెప్పింది గుర్తులేదా అంటూ నిరంజన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రైతులు వరి సాగు చేయాలని బండి సంజయ్ చెప్పింది వాస్తవం కాదా? అని ప్రశ్నించిన నిరంజన్ రెడ్డి, ఆ తర్వాత బాయిల్డ్ రైస్, రా రైస్ అంటూ రాజకీయం చేసింది నిజం కాదా అంటూ నిలదీశారు.

అమ్మవారి సాక్షిగా అబద్దాలు ఆడుతున్నారు.. సిగ్గులేదా?

అమ్మవారి సాక్షిగా అబద్దాలు ఆడుతున్నారు.. సిగ్గులేదా?

ఇప్పుడు ధాన్యం కొనుగోలు మా ఘనత అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా? అని ప్రశ్నించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమ్మవారి సాక్షిగా అబద్దాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం ముందుకు రాకపోవడంతో యాసంగి ధాన్యాన్ని తామే కొంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారని, ఇది తమ ఘనత అని బీజేపీ నేతలు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు.

ఇక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అడుగడుగునా అన్యాయం చేస్తుందని చెప్పిన మంత్రి నిరంజన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ లకు పలు ప్రశ్నలను సంధించారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని అడిగారా?

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని అడిగారా?

పాలమూరు జిల్లాకు కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక మంచి పని ఏమిటో చెప్పాలని నిరంజన్ రెడ్డి నిలదీశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ బిజెపి నేతలు ఎప్పుడైనా నోరు తెరిచి అడిగిన పాపాన పోయారా అంటూ నిలదీశారు.

సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టను 1200 కోట్లతో పునర్ నిర్మించినట్లుగా, కనీసం ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్రం నుండి తీసుకొచ్చి జోగులాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయిస్తామని వాగ్దానం చేసే దమ్ము ఉందా అంటూ మంత్రి బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.

కేంద్రం నుండి నిధులు తెచ్చే దమ్ముందా? నిరంజన్ రెడ్డి సవాల్

కేంద్రం నుండి నిధులు తెచ్చే దమ్ముందా? నిరంజన్ రెడ్డి సవాల్

జోగులాంబ ఆలయం కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో ఉందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్ట లేకపోతుందని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఇక ఇదే సమయంలో మాచర్ల గద్వాల రైల్వే లైన్ కు కేంద్రం నుంచి నిధులు తెచ్చే దమ్ము ఉందా అంటూ మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ నేతలు తమ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే పాదయాత్ర కొనసాగించాలని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+