తెలంగాణతో గోక్కున్నోడు బాగుపడిన చరిత్ర లేదు.!కేంద్ర ప్రభుత్వాన్నిహెచ్చరించి మంత్రి నిరంజన్ రెడ్డి.!
హైదరాబాద్ : కేంద్ర బీజేపి ప్రభుత్వంతో పాటు రాష్ట్ర బీజేపి పార్టీపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు, ఏడేండ్లలో తెలంగాణ బీజేపీ రాష్ట్రానికి ఏం ఒరగబెట్టిందని, బీజేపీ మంత్రి, ఎంపీలు తెలంగాణ కోసం ఒక్క పథకాన్నైనా తీసుకువచ్చారా అని సూటిగా ప్రశ్నించారు. రైతన్నలతో గోక్కోవద్దని, వారితో గోక్కున్నోళ్లు ఎవరూ బాగుపడలేదని కేంద్ర, రాష్ట్ర బీజేపి నేతలను నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. అంతే కాకుండా వరి ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రం ఒకలాగా, రాష్ట్ర నేతలు మరోలాగా పొంతనలేకుండా మాట్లాడుతూ రైతులలో గందరగోళాన్ని సృష్టిస్్తున్నారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.

కేంద్ర రాష్ట్ర బీజేపి నేతలు దద్దమ్మలు.. కమలం నేతలపై నిప్పులు చెరిగిన వ్యవసాయ మంత్రి..
అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు మానుకుని, రాష్ట్ర బీజేపీ నేతలు నియంత్రణ పాటించాలని సూచించారు. యాసంగి వడ్ల కొనుగోలుపై కేంద్రం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని, ఓ పక్క ఉత్తర భారతదేశం రైతుల ఆందోళనలతో అట్టుడుకుతుందని, దక్షిణ భారత రైతుల సంఘీభావం ఉత్తరభారత రైతుల పోరాటానికి ఉందని స్పస్టం చేసారు. సుప్రీం కోర్టు జోక్యంతో కేంద్రం తాత్కాలికంగా నూతన వ్యవసాయ చట్టాలు పక్కనపెట్టిందిని, అయినా మూడు నల్లచట్టాలకు సంబంధించిన కత్తి రైతుల మెడ మీద వేలాడుతూనే ఉందని, ఇప్పటికైనా కేంద్రం వడ్ల కొనుగోలు విషయంలో పునంసమీక్షించుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు.

ఐకమత్యమే బలం..సమిష్టిగా కేంద్రంతో పోరాడుదామన్న మంత్రి నిరంజన్
కార్పోరేట్ పారిశ్రామిక వేత్తల రుణాలు మాఫీ చేసే కేంద్రానికి, రైతుల కోసం ఖర్చుపెట్టే శక్తి లేదా అని, రైతాంగ సంక్షేమం కోసం కేంద్రం దిగిరావాల్సిందేనని పేర్కొన్నారు నిరంజన్ రెడ్డి. తెలంగాణలో పంటమార్పిడి కోసం రైతులను చైతన్యపరుస్తున్నామని, అందులో భాగంగా తెలంగాణలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు. 8.15 లక్షల ఎకరాలలో సాగుకు కేంద్రం నుండి అనుమతి సాధించామని, ఇలాంటి తరుణంలో రైతాంగాన్ని వరి ధాన్యం పండించాలని పదేపదే చెప్తూ అయోమయానికి గురి చేస్తున్నారని బీజేపి నేతలపై మంత్రి నిరంజన్ రెడ్డి ద్వజమెత్తారు.

ఐకమత్యమే బలం..సమిష్టిగా కేంద్రంతో పోరాడుదామన్న మంత్రి నిరంజన్
కార్పోరేట్ పారిశ్రామిక వేత్తల రుణాలు మాఫీ చేసే కేంద్రానికి, రైతుల కోసం ఖర్చుపెట్టే శక్తి లేదా అని, రైతాంగ సంక్షేమం కోసం కేంద్రం దిగిరావాల్సిందేనని పేర్కొన్నారు నిరంజన్ రెడ్డి. తెలంగాణలో పంటమార్పిడి కోసం రైతులను చైతన్యపరుస్తున్నామని, అందులో భాగంగా తెలంగాణలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు. 8.15 లక్షల ఎకరాలలో సాగుకు కేంద్రం నుండి అనుమతి సాధించామని, ఇలాంటి తరుణంలో రైతాంగాన్ని వరి ధాన్యం పండించాలని పదేపదే చెప్తూ అయోమయానికి గురి చేస్తున్నారని బీజేపి నేతలపై మంత్రి నిరంజన్ రెడ్డి ద్వజమెత్తారు.

పంటమార్పిడి కోసం రైతులను చైతన్యపరుస్తున్నాం.. రైతులను రెచ్చగొట్టొద్దన్న నిరంజన్ రెడ్డి
అంతే కాకుండా దేశంలో సమగ్ర వ్యవసాయ విధానం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రణాళికలు రచిస్తున్నారని మంత్రి తెలిపారు. సాగుయోగ్యమైన భూమి, సాగునీటి సదుపాయం, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ ను కేంద్రం పరిశీలించాలని, దేశ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు, నిపుణులతో చర్చించి కేంద్రమే పంటమార్పిడికి ఒక విధానం ప్రకటించాలని, తాత్కాలిక లబ్దికోసం చిల్లర రాజకీయాలు చేయొద్దని మంత్రి సూచించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతల చిల్లర చేష్టలతో నష్టపోయేది కేంద్ర ప్రభుత్వమేనని, యాసంగి వడ్లు కొంటరా ? కొనరా కేంద్రం స్పష్టంచేయాలని మంత్రి సూటిగా ప్రశ్నించారు. ఆరుగాలం కష్టించి అన్నం పెట్టే రైతులను వేధించొద్దని, దేశంలో ఆహార ఉత్పత్తులను అన్నింటినీ కేంద్రం కొనుగోలు చేయాలని మంత్రి డిమాండ్ చేసారు.

రైతుల ఉసురుపోసుకోవద్దు.. బీజేపి నేతలకు వ్యవసాయమంత్రి నిరంజన్ రెడ్డి సలహా
బీజేపీ అధికారంలోకి వచ్చాక వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులను కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుందని, పంటల కొనుగోలుకు కొత్త మార్గాలు ఎందుకు అన్వేషించడం లేదని నిరంజన్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వ విధానాల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వ ప్రధాని సమ్మాన్ యోజన పథకం సమర్థవంతంగా అమలు కాగలిగిందని మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తు చేసారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు హాజరైన తెలంగాణ రైతాంగానికి వ్యవసాయ మంత్రిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ప్రకటించారు.












Click it and Unblock the Notifications