22 నుంచి ఆర్టీసీ బస్సులు బంద్ - ప్రభుత్వం కీలక నిర్ణయం..!!
ఆర్టీసీ బంద్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 22 నుంచి ఆర్టీసీ బస్సులు నిలిచి పోనున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటన చేసాయి. తమ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. సమ్మె తప్పటం లేదని కార్మిక సంఘాలు ప్రకటించాయి. దీంతో, ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇదే అంశం పైన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
తమ డిమాండ్ల నెరవేరని పక్షంలో ఏప్రిల్ 22వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ సోమవారం ప్రకటించింది. 21వ తేదీ అర్థరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు నిలిపి వేస్తామని స్పష్టం చేసింది. 22వ తేదీ తెల్లవారుజాము నుంచి సమ్మెలోకి వెళ్తామని పేర్కొంది. సోమవారం ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని కార్మిక శాఖ కార్యాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమయ్యారు. ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె నిర్ణయం వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్టీసీ పరిరక్షణ - ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని సంస్థ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

సమ్మె ఆలోచన వద్దని మంత్రి పొన్నం వినతి
సమస్యలు చెప్పుకోవడానికి తమ తలుపులు తెరిచే ఉన్నాయి.. ఎవరైనా వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చునని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల అంశాలు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్టీసీ విలీనానికి సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ పని చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాలకు ఎన్నికలు సహా మరో 30 డిమాండ్ల తో సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు ఈ సందర్భంగా ప్రకటించారు.
-
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన












Click it and Unblock the Notifications