TGSRTC: మానవత్వం చాటుకున్న ఆర్టీసీ సిబ్బందిని సన్మానించిన మంత్రి పొన్నం..
కరీంనగర్ బస్టాండ్ లో ఆపదలో ఉన్న గర్భిణీకి ప్రసవం చేసిన ఆర్టీసీ సిబ్బందిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. వారికి క్యాష్ రివార్డ్ అందజేశారు. ఆర్టీసీ ఎస్ఎం నోముల అంజయ్య గౌడ్, మిగతా సిబ్బందిని మంత్రి అభినందించారు. జూన్ 16న ఒడిశాకు చెందిన కుమారి, దూల దంపతులు ఖమ్మం మీదుగా ఒడిశా వెళ్లేందుకు కరీంనగర్ బస్టాండ్ కు చేరుకున్నారు. అయితే కుమారి అప్పటికే నిండు గర్భిణీ కావడంతో పురిటి నొప్పులు వచ్చాయి.
దీంతో భార్త దూల ఆమెన చెట్టు కింద పడుకోబెట్టి ఎస్ఎం అంజయ్య గౌడ్ కు పరిస్థితిని విరించారు. దీంతో ఎస్ఎం స్వీపర్లను కుమారి వద్దు పంపించారు. ఆ వెంటనే 108కి సమాచారం ఇచ్చారు. ఇలోకా కుమారి నొప్పులు ఎక్కువ కావడంతో ఆర్టీసీ మహిళా సిబ్బంది చీరలు అడ్డుకట్టి ప్రసవం చేశారు. అక్కడి చేరుకున్న 108 సిబ్బంది తల్లీ బడ్డలను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఆపదలో ఉన్న మహిళను ఆదుకున్న ఆర్టీసీ సిబ్బందిపై ప్రజలు ప్రశంసలు కురిపించారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. "కరీంనగర్ బస్ స్టేషన్ లో గర్బిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న #TGSRTC మహిళా సిబ్బందికి నా అభినందనలు. మీరు సకాలంలో స్పందించడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు.విధి నిర్వహణలో కూడా మీరు ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను" అని ట్వీట్ చేశారు.
కరీంనగర్ బస్ స్టేషన్ లో గర్బిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న #TGSRTC మహిళా సిబ్బందికి నా అభినందనలు. మీరు సకాలంలో స్పందించడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు.
— Revanth Reddy (@revanth_anumula) June 17, 2024
విధి నిర్వహణలో కూడా మీరు ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. pic.twitter.com/T68rF40q69
తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ సిబ్బందిని సన్మానించారు. కుమారికి పురుడుపోసిన ఆర్టీసీ స్వీపర్లు సైదమ్మ, స్రవంతి, లావణ్య, భవానీ, రేణుకను అధికారులు, ప్రయాణికులు అభినందించారు.












Click it and Unblock the Notifications