సీతక్క కాళ్లు మొక్కిన పొన్నం - ఆశీర్వదించమ్మా..!!
రక్షాబంధన్ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అనురాగానికి.. ఆప్యాయతకు ప్రతిరూపంగా నిలిచే రాఖీకి ప్రత్యేకత ఉంది. పలువురు ప్రముఖులు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ, తెలంగాణ సీఎంలతో పాటుగా మంత్రులు రక్షాబంధన్ వేళ శుభాకాంక్షలు చెప్పారు. మంత్రి సీతక్క సీఎం రేవంత్ కు రాఖీ కట్టారు. మంత్రుల క్వార్టర్స్ లో పొన్నంకు సీతక్క రాఖీ కట్టగా.. ప్రభాకర్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.
మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, వారి సోదరులకు మంత్రి సీతక్క రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సీతక్కకు మంత్రి పొన్నం చీరను బహూకరించారు. సీతక్క నుంచి పొన్నం ప్రభాకర్ ఆశీర్వాదం తీసుకున్నారు. సీతక్కకు పొన్నం ప్రభాకర్ సోదరులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, రాఖీ పర్వదినం సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ రాఖీ కట్టారు. మినిస్టర్ క్వార్టర్స్‌లో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. సోదరి సీతక్క అంటూ ఆత్మీయంగా పలకరించి ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి శ్రీధర్ బాబుకి మంథని నియోజకవర్గ మహిళలు రాఖీ కట్టి శుభాకాంక్షలు చెప్పారు. రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారతతో సహా కోటీశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో మహిళలందరూ భాగస్వాములయ్యే వరకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. మహిళల రక్షణ, భద్రత, అభివృద్ధి, సంక్షేమంలో రాజీలేదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications