మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు తప్పిన ప్రమాదం, ఢీ కొన్న కాన్వాయ్‌లోని వాహనాలు..

తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. సోమవారం ఆయన కాన్వాయ్ బంజారాహిల్స్ నుంచి వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. కాన్వాయ్‌లోని మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. దీంతో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.

సోమవారం మద్యాహ్నం వెంగల్ రావు పార్క్ సమీపంలో కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. అద్దాలు ధ్వంసం కావడంతో అందులో వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో మరో వాహనంలో పువ్వాడ అజయ్ కుమార్ వెళ్లిపోయారు. వెంటనే ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణం ఏంటీ అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందని డ్రైవర్లు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

 minister puvvada ajaykumar convoy vehicles are collide

Recommended Video

    #HappyBirthdayKCR: Gajwel People Gift To CM KCR | Oneindia Telugu

    మంత్రి కాన్వాయ్‌లో వాహనాలు ఢీ కొనడం చర్చానీయాంశమైంది. ఆ సమయంలో ఇతర వాహనాలు రోడ్డుపై తక్కువగా ఉండటం, రద్దీ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. లేదంటే వాహనాలు వరసగా ఢీ కొని ప్రమాదం జరిగి ఉండేది. ఘటనను ఊహించుకుంటేనే భయమేస్తోందని కాన్వాయ్ సిబ్బంది ఒకరు చెప్తున్నారు. వాహనాల డ్రైవర్లు అప్రమత్తంగా లేకపోవడంతో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+