‘సీఎం’ మార్పుపై మంత్రి శ్రీధర్ బాబు తేల్చేశారు!
కంచ గచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ప్రైవేటు పరం కాబోతున్న 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కాపాడిందని చెప్పారు. శనివారం మంత్రి శ్రీధర్ బాబు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు వైరల్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. హెచ్‌సీయూ భూములు, పరిసరాల్లో ఏనుగులు ఉన్నాయా. అని ప్రశ్నించారు. విద్యార్థులను ప్రభావితం చేసి ప్రభుత్వ పనులను అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. హైదరాబాద్ కు పెట్టుబడులు, ఉద్యోగాలు రావొద్దని కుట్ర చేస్తున్నారని శ్రీధర్ బాబు మండిపడ్డారు.

తొమ్మిదేళ్ల క్రితం రాజస్థాన్‌లో చనిపోయిన జింక పిల్లను హెచ్ సీయూలో చనిపోయినట్లు చూపించారన్నారు. సోషల్ మీడియాలను ఉపయోగించుకుని తమ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. సెబీ నిబంధనలకు అనుగుణంగానే బాండ్ల జారీ ప్రక్రియ ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఐసీఐసీఐ నుంచి తాము ఎలాంటి లోన్లు తీసుకోలేదన్నారు. కంచ గచ్చిబౌలి భూములపై ఎలాంటి లావాదేవీలు లేవన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమ కార్యక్రమాల కోసమే నిధులు సేకరిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బాధ్యతాయుతంగా పనిచేయాలని మూసీ ప్రక్షాళన చేస్తున్నామన్నారు. ప్రకృతి కాలుష్యం తరిమికొట్టాలన్నారు. మూసీ పరివాహక ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించాలని ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ నేతలు విరోధులుగా మారారన్నారు.
సీఎం పదవిపై తేల్చేసిన శ్రీధర్ బాబు
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపైనా మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. టైమ్ ఎప్పుడు వస్తుందా? సీఎం రేవంత్ ను మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ చూస్తోందంటూ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సీఎంను మారిస్తే మళ్లీ అర్హత కలిగిన సీఎం దొరకడం కష్టమని.. ఎలిజిబుల్ ఉన్న శ్రీధర్ బాబు సహా మిగితా వారికి వసూళ్లు చేయడం రాదన్నాు. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ సీఎం మార్పుపై వెనక్కి తగ్గుతోందన్నారు బీజేపీ ఎంపీ అరవింద్.
ఈ నేపథ్యంలో అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా ఉంటారని.. ఉండి తీరుతారంటూ తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి.. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా, అవినీతి లేకుండా పరిపాలన చేస్తున్నారన్నారు. అంతేగాక, తమ పార్టీలో అందరూ సమర్థులేనని వ్యాఖ్యానించారు.
అరవింద్ ఏ సందర్భంలో మాట్లాడారో తెలియదని శ్రీధర్ బాబు అన్నారు. తనకు అరవింద్ చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి తన గురించి అలా అన్నాడేమోనని చెప్పారు. తమ పార్టీలో ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలో అంతిమ నిర్ణయం అధిష్టానానిదేనని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
మీనాక్షి నటరాజన్ ఇష్యూపై ఇలా
సచివాలయంలో మీనాక్షి నటరాజన్ ఎలాంటి సమీక్ష నిర్వహించలేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఆమె తమను కలవడానికి సచివాలయానికి వచ్చారని తెలిపారు. సచివాలయానికి ఎవరైనా రావచ్చన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కూడా సచివాలయానికి వస్తారని చెప్పారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications