బీజేపీ తెలంగాణానేతలను బిచ్చగాళ్ళుగా చూస్తుంది; కేసీఆర్ ను బద్నాం చేసే కుట్రలు చేస్తోంది: శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ధాన్యం కొనుగోళ్లపై రగడ కొనసాగుతూనే ఉంది. బిజెపి వర్సెస్ టిఆర్ఎస్ అన్నట్టుగా ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ మంత్రులు తెలంగాణా రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చెయ్యాలంటూ కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నారు. కేంద్ర సర్కార్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ మంత్రులు ధాన్యం కొనుగోలు విషయంలో ఢిల్లీ పెద్దలను కలవడం కోసం వెళ్లిన విషయం తెలిసిందే.

సీఎం కేసీఆర్ అధికారంలోకి రాకూడదని బద్నాం చేసే కుట్రలు

సీఎం కేసీఆర్ అధికారంలోకి రాకూడదని బద్నాం చేసే కుట్రలు

రైతుల సమస్యలను విన్నవించడం కోసం వెళ్ళిన తెలంగాణ మంత్రులను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవమానపరచడం సరికాదని మండిపడ్డారు తెలంగాణ ప్రభుత్వం పై కేంద్రం చేస్తున్న కుట్రలను చేధిస్తామని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మరోమారు అధికారంలోకి రాకూడదని, కావాలని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయనను బద్నాం చేయడం కోసం బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ మంత్రులను అవమాన పరచి ఢిల్లీ నుంచి పంపిస్తే భవిష్యత్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. బీజేపీని ఎదుర్కోవడానికి తమకు ఉండే వ్యూహం తమకుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.

 రాష్ట్ర సమస్యలపై టీఆర్ఎస్ మాత్రమే పోరాటం చేస్తుంది

రాష్ట్ర సమస్యలపై టీఆర్ఎస్ మాత్రమే పోరాటం చేస్తుంది

రాష్ట్ర సమస్యలపై పోరాటం కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ సిద్ధంగా లేవని పేర్కొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రైతుల సమస్యల పరిష్కారం కోసం టిఆర్ఎస్ పార్టీ నేతలు పోరాటం చేస్తున్నారన్నారు. జాతీయ పార్టీల నాయకులు ఢిల్లీకి పైరవీల కోసం వెళితే టిఆర్ఎస్ నాయకులు మాత్రం తెలంగాణ ప్రయోజనాల కోసం వెళుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ధాన్యం సేకరణ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని మరొకమారు ఆయన స్పష్టం చేశారు. అయితే కేంద్రం ధాన్యం కొనకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

యాసంగి వరి వెయ్యాలా వద్దా స్పష్టత ఇవ్వండి

యాసంగి వరి వెయ్యాలా వద్దా స్పష్టత ఇవ్వండి

ఇక ఢిల్లీకి వెళ్లిన బీజేపీ నేతలు ఢిల్లీలో రైతుల కోసం కాకుండా తమ రాజకీయాల కోసం పెద్దలతో మాట్లాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. యాసంగి వరి వేయాలా వద్దా అన్నది స్పష్టంగా చెప్పాలని శ్రీనివాస్ గౌడ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం కంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏం గొప్పగా పాలన సాగించారో చూపించాలని సవాల్ విసిరారు. కేవలం అధికార దాహంతో బీజేపీ తెలంగాణా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మంచి చేస్తే దేశమంతా తిరిగి కేంద్రం మంచి చేస్తుందని చెబుతామని, చెడు చేసే దానికి తగ్గట్టే ప్రవర్తిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

అడుక్కోవటానికి బిచ్చగాళ్ళం కాదు

అడుక్కోవటానికి బిచ్చగాళ్ళం కాదు

అంతేకాదు అడుక్కోవడానికి తాము బిచ్చగాళ్లము కాదని తెలంగాణ నేతలను కేంద్రంలోని బిజెపి నేతలు బిచ్చగాళ్ళుగా చూస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. బీజేపీకి తగిన బుద్ధి చెప్పి తీరుతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. రైతులను తొక్కాలని చూస్తే తెలంగాణా ఆగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. పంజాబ్ కో న్యాయం తెలంగాణా రాష్ట్రానికి మరో న్యాయమా అని ప్రశ్నించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇప్పటికైనా తెలంగాణాకు కేంద్రం క్షమాపణ చెప్పాలని, రైతులు పండించిన ధాన్యం తక్షణం కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+