వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేం నామినేటెడ్ వ్యక్తులం కాదు; రాజకీయంగా మాట్లాడకండి: గవర్నర్ కు మంత్రి తలసాని చురకలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ప్రెస్ మీట్లు పెట్టి మరీ అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు తమవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తాము నామినేటెడ్ వ్యక్తులం కాదని తలసాని గవర్నర్ తమిళిసై కి చురకలంటించారు.

రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిలా మాట్లాడటం మంచిది కాదు: మంత్రి తలసాని

రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిలా మాట్లాడటం మంచిది కాదు: మంత్రి తలసాని

గవర్నర్ తమిళిసై రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తుల్లా మాట్లాడటం మంచిది కాదంటూ నిప్పులు చెరిగిన తలసాని ఏది పడితే అది మాట్లాడటం కరెక్ట్ కాదంటూ గవర్నర్ పై విరుచుకుపడ్డారు. ఈ ముఖ్యమంత్రితో పని చేయడం ఇష్టం లేదని చెప్పడం సరికాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. గవర్నర్ రాజకీయాలు మాట్లాడడం మంచిది కాదని హితవు పలికారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పైన గవర్నర్ తమిళిసై చేస్తున్న ఆరోపణలు సరికాదంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

ఉపరాష్ట్రపతి, గవర్నర్ పదవుల పాత్ర చాలా తక్కువ

ఉపరాష్ట్రపతి, గవర్నర్ పదవుల పాత్ర చాలా తక్కువ

ఒక మహిళా గవర్నర్ కు ఎంత గౌరవం ఇవ్వాలో గవర్నర్ తమిళిసై కు ముఖ్యమంత్రి కేసీఆర్ అంత గౌరవం ఇచ్చారని, కానీ ఆ విషయాన్ని విస్మరించి గవర్నర్ ప్రవర్తిస్తున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి, గవర్నర్ పదవుల పాత్ర చాలా తక్కువ అని పేర్కొన్న తలసాని, గవర్నర్ గా మీ బాధ్యత మీరు నిర్వర్తించండి అంటూ హితవు పలికారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంటి వారే ప్రోటోకాల్ విషయంలో కొన్ని పరిమితులు ఉంటాయని చెప్పారని, అది గవర్నర్ తెలుసుకొని మాట్లాడాలి అంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

గవర్నర్ కు తెలంగాణా ప్రభుత్వానికి మధ్య ముదురుతున్న వివాదం

గవర్నర్ కు తెలంగాణా ప్రభుత్వానికి మధ్య ముదురుతున్న వివాదం

గవర్నర్ గా మీ బాధ్యత మీరు నిర్వర్తించాలని చురకలంటించారు. ఇక రాజ్యాంగపరమైన విధానంలో కాంగ్రెస్ స్టాండ్ ఏంటి అని ప్రశ్నించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతిపక్షాలకు పని, పాట లేదా అంటూ మండిపడ్డారు. పొద్దున లేస్తే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం తప్ప వేరే పనేం లేదంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ విరుచుకుపడ్డారు. ఇక గవర్నర్ కు, తెలంగాణా ప్రభుత్వానికి మధ్య చోటు చేసుకున్న ప్రోటోకాల్ వివాదం తాజా వ్యాఖ్యలతో మరింత ముదురుతున్నట్టు కనిపిస్తుంది.

English summary
Minister Talasani Srinivas Yadav made sensational remarks against Telangana Governor Tamilsai Soundarajan. The incumbent governor said it was wrong to hold press conferences and blame the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X