కేటీఆర్ కాదు.. ఆయన జేజీఆర్: ఉత్తమ్ కుమార్ రెడ్డి సెటైర్లు

కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేటీఆర్ మళ్లీ అనాలోచితంగా మాట్లాడారని మండిపడ్డారు. కేటీఆర్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం కమీషన్ల కోసమే కక్కుర్తి పడి, ప్రాజెక్టులు కట్టారని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు.

బీఆర్ఎస్‌ చర్యలతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారని ఉత్తమ్ తెలిపారు. బీఆర్ఎస్‌ నాసిరకం ప్రాజెక్టులు కట్టడం వల్లే లోపాలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.

Minister Uttam Kumar Reddy hits out at KTR for kaleshwaram project issue

కేటీఆర్ తన పేరును జోసెఫ్‌ గోబెల్స్ రామారావు(జేజీఆర్)గా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రతిసారీ అసత్యపు మాటలతో జనాన్ని నమ్మించాలని చూస్తున్నారని, బీఆర్ఎస్‌ పార్టీని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవం ఎంటో ప్రజలందరికి తెలుసని చెప్పారు.

ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రతిరోజు సమీక్షలు జరుపుతున్నామని యుద్ధ ప్రాతిపదికన నిర్మస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏటా ఆరు నుంచి ఆరున్నర లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కోసం కృషి చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వెల్లడించారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో నీటిపారుదల శాఖ బడ్జెట్‌పై కొంత స్పష్టత రావటం జరిగిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో నీటిపారుదల శాఖ రూ.10,820 కోట్ల పనులపై ఖర్చుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఈ పనులపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజినీర్ల అందరితో సమీక్షించామన్నారు. వర్షాకాలం కాబట్టి నీటిపారుదల శాఖకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులపై తీసుకోవాల్సిన జాగ్రతలపై చర్చించామని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నీటిపారుదల విషయంలో స్పష్టమైన వైఖరీతో ఉన్నామని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. దెబ్బతిన్న ప్రాజెక్టుల మరమ్మతులకు నిపుణుల సలహాలతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. నిర్మాణంలో నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీళ్లీస్తామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+