మేం ప్రజల వైపు, ఆంధ్రా నుంచి తిరిగి తేవాలి: కెసిఆర్‌కు కోదండ

హైదరాబాద్: తాము ప్రజల పక్షాన నిలబడతామని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ చెప్పారు. సబ్బండవర్గాల పురోభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఆదివారం నాడు జెఏసీ సమావేశం జరిగింది. ఆ తర్వాత కోదండరామ్ మీడియాతో మాట్లాడారు.

కెసిఆర్ ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. కరువు నివారణ చర్యలు తీసుకోవాలని, ఉపాధి హామీకి గండి కొట్టవద్దని, రైతులకు ప్రత్యామ్నాయ బీమా ఇవ్వాలని, ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేయాలని సూచించారు. మూతబడ్డ పరిశ్రమలు తెరిపించాలన్నారు. విద్యుత్తు శాఖలో ఆంక్షలు తొలగించాలన్నారు.

కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్‌ను రద్దు చేయాలని, ఉద్యమకారులను గుర్తించాలన్నారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ప్రభుత్వం కరవు సహాయక చర్యలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పంటనష్ట పోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలు పరిహారంగా ఇవ్వాలన్నారు.

బోదన్‌, ముత్యంపేట, మెదక్‌ చక్కర కర్మాగారాలను, సిర్పూర్‌ పేపర్‌ మిల్లులను తెరవాలని కోరారు. అన్నిరకాల ఉద్యోగాల్లో స్థానికులకు 70శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. విద్య, వైద్య రంగాలపై త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు, పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఓపెన్ కాస్ట్ మైనింగులను నిరోధించాలన్నారు. విద్యుత్తు, తాగు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర అధ్యయన నివేదిక(డీపీఆర్‌)ను బయటపెట్టాలన్నారు. ప్రభుత్వం శాసనసభలో ప్రకటించిన ప్రాజెక్టులపై తాము అధ్యయనం చేస్తామన్నారు.

కోదండరామ్, కెసిఆర్

కోదండరామ్, కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ క్రమంలో ప్రజలు వెలువరించిన ఆకాంక్షలకు అనుగుణంగా జేఏసీ తన కార్యాచరణను మరింత దృఢనిశ్చయంతో కొనసాగిస్తుందన్నారు.

కోదండరామ్

కోదండరామ్

కార్పొరేట్‌ విద్యా వ్యవస్థను నిర్మూలించాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖాళీలను భర్తీ చేయాలన్నారు. పట్టణాల్లో వ్యవసాయానికి అనుబంధ సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించాలని, ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు ఎత్తిపోతల పథకాలను జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాలన్నారు.

కోదండరామ్

కోదండరామ్

మణుగూరు థర్మల్‌ విద్యుత్తు ప్రాజెక్టు, జెన్‌కో ప్రాజెక్టుల బ్యాక్‌డౌన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంతో కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం, స్వల్పకాల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు, థర్మల్‌ పవర్‌ టెక్‌తో చేసుకున్న ఒప్పందాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.

 కోదండరామ్

కోదండరామ్

ఉద్యమం కోసం త్యాగాలు చేసిన వారికి గుర్తింపు ఇవ్వాలని, ఉద్యమంలో ప్రత్యేకపాత్ర పోషించిన న్యాయవాదుల సంక్షేమ నిధికి కేటాయించిన రూ.100 కోట్లపై స్పష్టత ఇవ్వాలని కోదండరామ్ డిమాండ్ చేశారు.

కోదండరామ్

కోదండరామ్


స్థానికత ఆధారంగానే ఉద్యోగుల, పెన్షర్ల పంపిణీ జరగాలని, కార్పొరేషన్ల ఉద్యోగుల పంపిణీలో, న్యాయవయవస్థకు చెందిన ఉద్యోగుల, న్యాయాధికారుల బట్వాడాలోనూ ఇదే సూత్రాన్ని పాటించాలని, హైకోర్టు విభజన చేపట్టాలన్నారు. ముంపుపేరుతో ఆంధ్రాలో విలీనం చేసిన గ్రామాలను తిరిగి పొందడానికి తెలంగాణ ప్రయత్నించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+