KTR: ప్రచారంలో దూసుకెళ్తున్న కేటీఆర్.. పోటీగా వస్తున్న హరీశ్ రావు..
తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇప్పటికే గులాబీ పార్టీ అధినేత 115 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇటు కేటీఆర్, హరీశ్ రావు జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ రోజుకు రెండు నుంచి మూడు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కేటీఆర్ సోమవారం నల్గొండ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఐటీ టవర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో కూడా పర్యటించారు.
జిల్లాల్లో పర్యటిస్తునే హైదరాబాద్ లోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. తన పర్యటనలో కేటీఆర్ తెలంగాణ అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. గత 9 ఏళ్లలో చేసిన పనులను ప్రజలకు చెబుతున్నారు. తండ్రి కేసీఆర్ లాగానే ప్రజలను ఆకట్టుకునే ప్రసంగాలు చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా గురువారం కేటీఆర్ రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పర్యటించారు. రైతు ఆదాయం డబుల్ కావాలంటే నోటి మాటలతో సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి మాట్లాడారు.

ఆయన రంగారెడ్డి జిల్లా రావిర్యాల వద్ద దేశంలోనే అత్యాధునిక, ఆటోమేషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో నిర్మించిన విజయ మెగా డెయిరీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఐదు విప్లవాలు మీ కళ్ల ముందే ఆవిష్కృతమవుతున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. 2014లో కేవలం 68 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయ్యేదని.. ఇప్పుడు మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ ప్రచారంతో దూసుకెళ్తుంటే ప్రతిపక్షాలు ఇంకా తమ ప్రచారాన్ని మొదలు పెట్టలేదు. బీజేపీ తరఫున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మహబూబ్ నగర్, నిజామాబాద్ లో పర్యటించారు. తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన యూనివర్శిటీని ప్రకటించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తూనే ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. త్వరలో ఈ రెండు పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయునున్నాయి. అటు బీఎస్పీ కూడా మొదటి జాబితా విడుదల చేసింది.












Click it and Unblock the Notifications