పెళ్లి వేడుకల్లో తల్వార్ విన్యాసాలు: బాలుడి మెడ తెగి...

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: వినోదంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి బరాత్‌లో తల్వార్లతో మైనర్లు చేసిన విన్యాసాలు (మర్ఫా డాన్స్‌) ఓ బాలుడి ప్రాణాలు తీశాయి. హైదరాబాద్‌లోని షేక్‌పేటలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటనలో పోలీసులు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. షేక్‌పేటకు చెందిన సయ్యద్‌ హమీద్‌ స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మిత్రులు పిలవడంతో మూడురోజుల క్రితం అతను ఓ పెళ్లి బరాత్‌కు వెళ్లి నృత్యం​ చేశాడు.

Minor dies in wedding baraat at Shaikpet,

ఆ వేడుకల్లో అనుభవం లేకున్నా కత్తులు, తల్వార్లతో మైనర్లు విన్యాసాలు చేశారు. ఆ క్రమంలోనే దూసుకొచ్చిన తల్వార​్ హమీద్‌ మెడకు తగిలింది. దాంతో తీవ్రంగా రక్తస్రావం జరిగి పడిపోయాడు.

అతన్ని దారుసలాంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం అతను మరణించాడు. బాధితుడి తల్లి ఫిర్యాదుమేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదుచేశారు.

దర్యాప్తులో భాగంగా బరాత్‌లో తల్వార్లతో విన్యాసాలు చేసిన 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A minor boy died in a wedding baraat as talwar hit his neck at Shaikpaet of Hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి