హైదరాబాదులో 'సాయిబాబా' మిరాకిల్: గదుల్లో తిరిగిన ఆత్మ!
హైదరాబాద్: భాగ్యనగరం శివారులోని మీర్ పేట పరిధిలోని ప్రశాంతి హిల్స్ కాలనీలోని శ్రీ ద్వారకామయి సాయిబాబా పీఠంలో వింత చోటు చేసుకుంది. బాబా ప్రతిమ ఆకారం పీఠంలో కలియ తిరిగినట్లు సీసీటీవీ ఫుటేజీలలో కనిపించిందని చెబుతున్నారు.
ఈ ఆకారాన్ని మహాత్మ్యంగా చెబుతున్నారు. శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో బాబా విగ్రహానికి దగ్గర.. వెలుతురు ఆకారం కలియ తిరిగిందంటున్నారు. బాబు విగ్రహం అక్కడే ఉండగా ఆత్మలాగా ఇది కలియదిరిగిందని చెబుతున్నారు.
ఇది బాబా దైవ కృప అని, పీఠం నిర్వాహకులు సాయికృపానంద గోపాలకృష్ణానంద చెప్పారు. ఇలాంటి సంఘటనలు గతంలోను జరిగినట్లుగా భక్తులు నమ్మిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వినాయకుడు పాలు తాగాడని, సాయి బాబా పాలు తాగాడి, ఆంజనేయ స్వామి కనిపించారనే వాదనలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications