మియాపూర్ లో మిస్సయిన 13 నెలల పాప శవంగా .. పాప కళ్ళు పొడిచి.. ఆపై దారుణం
తెలుగు రాష్ట్రాలలో బాలికలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక ఘటన మరిచిపోకముందే చోటుచేసుకుంటున్న అనేక ఘటనలు ప్రజలను ఆవేదనకు గురి చేస్తున్నాయి. తాజాగా హైదరాబాదులోని మియాపూర్ లో ఆదివారం సాయంత్రం అదృశ్యమైన 13నెలల బాలిక ఈరోజు తెల్లవారుజామున విగతజీవిగా కనిపించింది.

అనుమానాస్పద స్థితిలో 13నెలల పాప మృతి
ఇంటి సమీపంలోని నీటి గుంటలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక బాలిక కళ్ళు పొడిచి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. పాప మృతిని అనుమానాస్పద మృతిగా గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మియాపూర్ ఓంకార్ నగర్ లో పాప మిస్సింగ్ ..13 ఏళ్ళ బాలుడు ఎత్తుకెళ్ళినట్టు అనుమానం
ఇక అసలు విషయానికి వస్తే మియాపూర్ ఓంకార్ నగర్ లో చెత్త ఏరుకుంటూ జీవనం సాగించే దంపతులకు ఓ పాప ఉంది. చెత్త ఏరడానికి వెళుతూ వారు పాపను పక్కింట్లో వదిలి వెళ్లారు . సాయంత్రం వచ్చేసరికి పాప కనిపించకపోవడంతో పక్కింటి వారిని అడిగారు. తమకు తెలియదని చెప్పడంతో చుట్టుపక్కలంతా వెతికారు అయినా పాప ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉండే 13 ఏళ్ల బాలుడు ఎత్తుకెళ్లినట్లుగా అనుమానిస్తున్న పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

పాప మిస్సింగ్ కేసులో అన్నీ అనుమానాలే ..
అంతేకాదు రాత్రి 9 గంటల ప్రాంతంలో పాప ఇంటికి వచ్చిన అమ్మమ్మ తీరు కూడా అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు పాప అమ్మమ్మను కూడా విచారిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం పాప ఏమైనా అత్యాచారానికి గురైందా అన్న విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. అసలు ఇంతకీ పాపని తీసుకు వెళ్లిన బాలుడు ఎవరు? అతను ఎక్కడికి తీసుకు వెళ్ళాడు ? పాప బాగా నీళ్లు తాగడం వల్ల మరణించినట్లుగా అనుమానం వ్యక్తమవుతున్న సమయంలో అసలేం జరిగింది ? పాప రెండు కళ్ళను పొడిచింది ఎవరు? పాప తల్లిదండ్రులకు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా ? అనే కోణంలో మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పాప కుటుంబాన్ని విచారిస్తున్న పోలీసులు
మరోవైపు పాప తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం కూడా పలు అనుమానాలకు తావివ్వడంతో పోలీసులు వారిని సైతం విచారిస్తున్నారు. పాపని ఎత్తుకెళ్లిన బాలుడు కూడా కనిపించకపోవడంతో అసలేం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న సాయంత్రం మిస్సింగ్ కేసు నమోదు కాగా తెల్లారేసరికి పాప శవంగా మారటంతో స్థానికులు షాక్ కు గురయ్యారు. ఈ కేసును త్వరితగతిలో తేలుస్తామని మియాపూర్ పోలీసులు చెబుతున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications