హైదరాబాద్‌లో అదృశ్యమై, ముంబైలో ప్రత్యక్షమై...

రామంతాపూర్ సత్యనగర్‌లో నివసిస్తున్న దిల్వార్ కూతురు ఇమ్రాన్‌బేగం (12), నేతాజీనగర్‌లో నివసిస్తున్న హారిఫ్ కూతురు ఫాతిమా (12) స్థానిక ప్రభుత్వ హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నారు. స్నేహితులైన వీరిద్దరు శనివారం ఇంట్లో నుండి స్కూల్‌కు వెళ్లి తిరిగి రాలేదు.
దీంతో కంగారుపడ్డ వారి తల్లిదండ్రులు బిడ్డలకోసం స్నేహితులు, బందువుల ఇళ్లలో గాలించినా ప్రయోజనంలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగానే ఇంతలోనే ఆదివారం ఉదయం ముంబయిలో ప్రత్యక్షమైనట్లు సమాచారం వచ్చింది.
ఎవరో ఆటోలో వచ్చి తీసుకెళ్లారని అక్కాచెల్లెళ్లు తల్లిదండ్రులకు ఫోన్‌లో చెప్పినట్లు తెలిసింది. ముంబై నుండి హైదరాబాద్‌కు వారిని తీసుకురావడానికి ఉప్పల్ పోలీసులు వెళ్లారు.












Click it and Unblock the Notifications