తిరుపతిలో నారాయణ ఇంటర్ విద్యార్థిని సాయిప్రజ్వల ప్రత్యక్షం?
అదృశ్యమైన ఇంటర్ విద్యార్థిని సాయి ప్రజ్వల క్షేమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. చిత్తూరు జిల్లా తిరుపతిలోని ఓ హోటల్ దగ్గర ఆమె ఉన్నట్లుగా భావిస్తున్నారు.
హైదరాబాద్: అదృశ్యమైన ఇంటర్ విద్యార్థిని సాయి ప్రజ్వల క్షేమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. చిత్తూరు జిల్లా తిరుపతిలోని ఓ హోటల్ దగ్గర ఆమె ఉన్నట్లుగా భావిస్తున్నారు.

సాయి ప్రజ్వలనా కాదా, తేలాల్సి ఉంది
అయితే, అక్కడ కనిపించింది సాయిప్రజ్వలనా లేక మరొకరా అని నిర్ధారించాల్సి ఉంది. హోటల్ వద్ద సాయిప్రజ్వల పోలికలతో ఓ అమ్మాయిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

హైదరాబాద్ పోలీసులకు సమాచారం
దీంతో పోలీసులు ఆ అమ్మాయిని తమ వెంట తీసుకు వెళ్లి హైదరాబాద్ పోలీసులతో పాటు అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసి హైదరాబాద్‌లో ఉన్న తండ్రి తిరుపతికి బయలుదేరారు. తండ్రి గుర్తించిన తర్వాత ఆమె సాయిప్రజ్వలనా కాదా తెలుస్తుంది.

ఎందుకు వచ్చినట్లు?
తిరుపతిలో ఉన్నది సాయి ప్రజ్వలే అయితే, ఎందుకు వచ్చినట్లు? ఎవరైనా తీసుకు వచ్చారా? లేక ఆమె స్వయంగా వచ్చిందా? అన్న విషయాలు తేలాల్సి ఉంది.

ప్రేమ కోణం దాగి ఉందా?
చదువులో ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని చెప్పి, తల్లిదండ్రులకు, సోదరి, సోదరులలకు క్షమాపణ చెబుతూ, తాను ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్లు ప్రజ్వల లేఖ రాసిన విషయం తెలిసిందే. చదవలేక వెళ్లిపోయిందా లేక దీని వెనుక ప్రేమ కోణం దాగి ఉందా అనే కోణంలోను దర్యాఫ్తు చేస్తున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications