mission bhagiratha telangana assembly telangana assembly session errabelli dayakar rao water kcr మిషన్ భగీరథ తెలంగాణ అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎర్రబెల్లి దయాకర్ రావు నీరు కేసీఆర్
24,543 జనావాసాలకు మిషన్ భగరీథ నీరు -ఛత్తీసగఢ్ వలసదారలకూ ఇస్తున్నాం: అసెంబ్లీలో మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణలోని ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో మొదలుపెట్టిన మిషన్ భగీరథకు సంబంధించి కీలక లెక్కలు వెలువడ్డాయి. రాష్ట్రంలో 24 వేల 543 జనావాసాలకు మిషన్ భగీరథ మంచినీరు సరఫరా జరుగుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
viral video: పాక్‌తో మోదీ స్నేహం వేళ -ఢిల్లీలో కిరాతక ఘటన -ఆ దేశాన్ని, ఓవైసీని తిట్టాలంటూ దాడి
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, దుర్గం చిన్నయ్య తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఎర్రబెల్లి సమాధానమిచ్చారు. ఛత్తీస్ గడ్ నుంచి వలస వచ్చిన వాళ్ళతో పాటు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 1,514 ఆవాసాలు ఉన్నాయని, వాటిలో 1,440 నివాసాలు ఇప్పటికే నీరు అందుతుండగా, మిగిలిన 74 ఆవాసాలకు అతిత్వరలోనే అందిస్తామన్నారు.

మిషన్ భగీరథ జలాల పంపిణీపై సమీక్షలు నిర్వహించాలని ఎమ్మెల్యేలకు ఇప్పటికే లేఖలు రాశానన్న మంత్రి ఎర్రబెల్లి.. కరెంట్ లేని ప్రాంతాల్లో సోలార్ పవర్ ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. కుండలు, బిందెల ప్రదర్శనలు ఇప్పుడు లేవని, మిషన్ భగీరథ పథకానికి ముఖ్యమంత్రే ఇంజినీర్ అని, కేసీఆర్ డైరెక్షన్‌లోనే ఈ పథకం అమలవుతుందని మంత్రి స్పష్టం చేశారు. అలాగే
మిషన్ భగీరథ పథకానికి దేశ స్థాయిలో వచ్చిన అనేక అవార్డులు, కేంద్రమే జల్ జీవన్ మిషన్ పేరుతో మన పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి సభకు గుర్తు చేశారు. సీఎం కెసిఆర్ రూపొందించిన ఈ పథకాన్ని దేశంలోని అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు. నీతి అయోగ్ చెప్పినా, కేంద్రం నిధులు ఇవ్వలేదని, పనులు ఇంకా ప్రారంభం కానీ ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలకు డబ్బులు విడుదల చేస్తున్నాదని, ఈ విషయంలో బీజేపీ ఎంపీలు కూడా కేంద్రాన్ని అడిగితే బాగుంటుందని మంత్రి అన్నారు.