సొంత ఫామ్ హౌస్ రోడ్ల కోసం ఎంపీ లాడ్స్ నిధుల దుర్వినియోగం.!మంత్రి మల్లారెడ్డి పై ఎన్ఎస్యూఐ మరో ఆరోపణ.!
హైదరాబాద్ : మంత్రి మల్లారెడ్డి మీద మరో ఆరోపణ చేసారు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఎప్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్. తన ఎంపీ లాడ్స్ నిధులను సొంత ఫామ్ హౌస్ రోడ్ల కోసం దుర్వినియోగ పరచిన ఘనత మంత్రి మల్లారెడ్డికే సొంతం అని సంచలన ఆరోపణలు చేసారు ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్. మంత్రి మల్లారెడ్డి అక్రమలకు సంబంధించిన చిట్టా తవ్వుతున్న కొద్ది పెరుగుతుందనన్నారు వెంకట్. ఇటీవల అన్యాక్రాంతం అవుతున్న భూములపై విచారణ జరిపిస్తున్న తెలంగాన సర్కార్ మల్లారెడ్డి ఆక్రమించిన భూములపై కూడా విచారణ జరిపించాలని ఎన్ఎస్యూఐ డిమాండ్ చేస్తోంది.

సర్వే నంబర్ 72,73 ప్రభుత్వ భూమిలో అక్రమకట్టడాలు.. మంత్రి కోర్టు స్టేని కూడా దిక్కరించారన్న ఎప్ఎస్యూఐ
తాజాగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ లోని సర్వే నంబర్ 72,73 ప్రభుత్వ భూమిలో కోర్టు స్టే ను సైతం దిక్కరిస్తున్న మంత్రి మల్లారెడ్డి బాగోతం బయటపడిందని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజవర్గ సుభాష్ నగర్లోని సర్వే నంబర్ 72,73 ప్రభుత్వ భూమిని మంత్రి మల్లారెడ్డి తన అధికార బలంతో, ప్రభుత్వం కళ్లుగప్పి సర్వే నంబర్ 70 గా సృష్టించి చెరువు కాలువను కబ్జా చేస్తూ నిర్మాణాన్ని చేపట్టారని సంచలన ఆరోపణలు చేసారు.

ఆక్రమణలపై స్థానికుల ఆందోళన...తాత్కాలికంగా నిర్మాణం నిలుపుదల చేసారన్న వెంకట్ బల్మూర్
చెరువు కాలువను మూసెయ్యడంతో గత సంవత్సరం కురిసిన బారి వర్షాలకు సుభాష్ నగర్ ప్రాంతమంతా నీట మునగడంతో స్థానిక ప్రజలు చేసిన ఆందోళనతో మల్లారెడ్డి చేపట్టిన కట్టడానికి కోర్టు స్టే విధించింది. దీంతో భవన నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలుపుదల చేసారని వెంకట్ స్పష్టం చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా వచ్చిన అవకాశంతో ఎవరికి గుట్టు చప్పుడు కాకుండా మంత్రి మల్లారెడ్డి తన అధికార బలంతో తిరిగి నిర్మాణాన్ని ప్రారంభించారని, కోర్టు స్టే ను సైతం దిక్కరిస్తున్న మంత్రి మల్లారెడ్డిని వెంటనే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చెయ్యాలని వెంకట్ డిమాండ్ చేశారు.

సొంత నిర్మాణాల కోసం ఎంపి నిధులు.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న కాంగ్రెస్..
ప్రభుత్వ భూములు, చెరువు కాలువలను ఆక్రమించే మంత్రి మల్లారెడ్డి, తన ఎంపీ లాడ్స్ నిధులను సైతం ప్రజల కోసం ఉపయోగించాల్సింది పోయి తన సొంత మల్లారెడ్డి తోట ఫామ్ హౌస్ కి ఉపయోగించడం దురదృష్టకరమని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ తెలిపారు.ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని ఉమ్మామహేశ్వర్ నగర్ కాలనీ ఫాక్స్ సాగర్ చెరువుని ఆనుకొని ఉండే మంత్రి మల్లారెడ్డికి చెందిన మల్లారెడ్డి తోట అనబడే ఫామ్ హౌస్ రోడ్డు కోసం తన సొంత ఎంపీ లాడ్స్ ఫండ్ ని ఉపయోగించిన ఘనత మినిస్టర్ మల్లారెడ్డిదని వెంకట్ తెలిపారు.
Recommended Video

మల్లారెడ్డి ఆక్రమణలపై విచారణ జరిపించాలి.. డిమాండ్ చేస్తున్న వెంకట్ బల్మూర్
తన నియోజవర్గంలోని వివిధ ప్రదేశాల్లో రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అవేం పట్టనట్టుగా మల్లారెడ్డి కేవలం తన సొంత ఫామ్ హౌస్ కోసం నిధులను దుర్వినియోగ పరచడం దురదృష్టకరమనన్నారు వెంకట్. ఫాక్స్ సాగర్ చెరువును ఆనుకొని ఉండే ఈ ఫామ్ హౌస్ భూములను కూడా ప్రభుత్వం సర్వే చేయించాలని, ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్టైతే వెంటనే స్వాధీనం చేసుకోవాలని అదే విధంగా ప్రజలు దీనిపై దృష్టి సారించాలని వెంకట్ కోరారు. ఇటీవల అన్యాక్రంతమవుతున్న భూముల మీద విచారణ చేయిస్తున్నట్టు గానే మల్లారెడ్డి ఆక్రమణలపైన కూడా ప్రభుత్వం విచారణ జరిపించాలని వెంకట్ బల్మూరి డిమాండ్ చేసారు.












Click it and Unblock the Notifications