రాజకీయాలకు బీఆర్ఎస్ ముఖ్య నేత గుడ్ బై..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు. ఇక.. తాజాగా బీజేపీలోకి వెళ్లేందుకు కొందరు గులాబీ నేతలు సిద్దమయ్యారు. వరుస కేసులతో బీఆర్ఎస్ అధినాయకత్వం చిక్కుల్లో ఉంది. రాజకీయంగా పట్టు సాధించేందుకు కాంగ్రెస్.. బీజేపీ నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ముఖ్యనేత రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు వెల్లడించారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. తాను రాజకీయంగా పార్టీ మార్పు పైన చర్చ జరుగుతుందని. తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు మల్లారెడ్డి. తాను ఇప్పుడు ఏ వైపునకు చూసేటట్లుగా కూడా లేనని స్పష్టం చేశారు. తనకు 73సంవత్సరాలు వచ్చాయని.. ఇంకా ఏవైపునకు చూడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాను ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిని అయ్యానని ఇంకా మూడేళ్లు రాజకీయాల్లో ఉంటానని చెప్పుకొచ్చారు. అస్సలు తాను రాజకీయమే వద్దనుకుంటున్నానని సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిద్దామని అనుకుంటున్నానని మల్లారెడ్డి పేర్కొన్నారు.

మల్లారెడ్డి ప్రముఖ విద్య వేత్తగా గుర్తింపు పొందారు. టీడీపీ నుంచి మల్కాజ్ గిరి ఎంపీగా పని చేసారు. 2016లో టీడీపీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుతం ఉన్న బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో 2019లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గంలో మల్లారెడ్డికి స్థానం కల్పించారు. ఇక, 2023 లో బీఆర్ఎస్ ఓడిన తరువాత పలు సందర్భాల్లో మల్లారెడ్డి పార్టీ వీడుతున్నారనే ప్రచారం సాగింది. ఆయన సంస్థల్లో ఐటీ సోదాలు జరిగాయి. కాగా, మల్లారెడ్డి కుటుంబ సభ్యులు బీజేపీతో టచ్ లోకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. కాగా.. మల్లారెడ్డి ఇక తాను రాజకీయంగా రిటైర్ అవుతున్నట్లు స్పష్టత ఇచ్చారు.












Click it and Unblock the Notifications