జనగామ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బండి సంజయ్ కు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సవాల్.. జనగామలో టీఆర్ఎస్, బీజేపీ ఫ్లెక్సీలతో టెన్షన్!!

|
Google Oneindia TeluguNews

జనగామ జిల్లాలో బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ ఉద్రిక్తత కొనసాగుతోంది. బండి సంజయ్ పాదయాత్ర జనగామ జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మొన్నటికి మొన్న దేవరుప్పల మండలంలో టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య రాళ్లదాడి ఘటన ఉద్రిక్తతలకు కారణం కాగా, ప్రస్తుతం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బండి సంజయ్ కు సవాల్ విసురుతూ పెట్టిన హోర్డింగ్ తో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి బండి సంజయ్ కు సవాల్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. జనగామ జిల్లాలో పాదయాత్ర సందర్భంగా, బండి సంజయ్ టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, టిఆర్ఎస్ మంత్రులు, సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇక ఇదే సమయంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బండి సంజయ్ కు సవాల్ విసిరారు.

ఆ నిధులు తెచ్చి జనగామలో అడుగు పెట్టమన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

నేడు జనగామ జిల్లా కేంద్రంలో బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా బండి సంజయ్ కు సవాల్ విసిరిన టిఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేసింది.
బండి సంజయ్ జనగామలో అడుగుపెట్టాలంటే నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన నిధులను తీసుకురావాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బండి సంజయ్ కు సవాల్ విసిరారు. సీఎం కెసిఆర్ నేతృత్వంలో అమలవుతున్న పథకాలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా లేవా చెప్పాలి అని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బండి సంజయ్ ను ప్రశ్నించారు.

బీజేపీ ఫ్లెక్సీలను చించివేసిన టీఆర్ఎస్ నాయకులు

జనగామలో బిజెపి పర్యటన సందర్భంగా బిజెపి బలాన్ని తెలియజేసేలా, బండి సంజయ్ కి స్వాగతం పలుకుతూ స్థానిక బిజెపి నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో టీఆర్ఎస్ కూడా పోటాపోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. అయితే బిజెపి నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, హోర్డింగ్స్ ను గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. టిఆర్ఎస్ నాయకులు ఈ పని చేశారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. బండి సంజయ్ పాదయాత్రను చూసి భయపడి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ తరహా చర్యలకు దిగుతున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. జనగామ జిల్లాలో గులాబీ పార్టీ పాలనకు కాలం చెల్లిందని తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. పోటాపోటీగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల నేపథ్యంలో జనగామలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.

English summary
MLA Muthireddy yadagiri reddy challenge to Bandi Sanjay. TRS and BJP flexies fight in Jangaon while bjp praja sangrama yatra entering to jangaon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X