తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి.!ఆ ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులపై ఉత్కంఠ.!
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈనెలాఖరుకు ఖాళీ కానున్న మూడు స్ధానాలకు సీఎం చంద్రశేఖర్ రావు ఇంకా అభ్యర్థలను ఖరారు చేయకపోవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.
హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో ఖాళీ అవుతోన్న ఎమ్మెల్యే కోటాలోని 3 శాసన మండలి స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికపై ఆసక్తి నెలకొంది. 2017లో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ముగ్గురు శాసనమండలి సభ్యుల పదవీకాలం.. ఈ ఏడాది మార్చి 29న ముగియనుంది. ఆ లోగా కొత్త సభ్యుల నియామకం కోసం గులాబీ పార్టీలో కసరత్తులు మొదలైనట్టు తెలుస్తోంది. తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

తెలంగాణలో మూడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు.. భారీ సంఖ్యలో ఆశావాహులు
షెడ్యూల్ ప్రకారం, మార్చి 6న తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్, మార్చి 13 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. మార్చి 14న అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు పరిశీలిస్తారు. ఉపసంహరణకు మార్చి 16 వరకు గడువు ఇచ్చారు. ఆయా స్థానాలకు ఒకరికన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే.. మార్చి 23న పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓట్లు వేసేందుకు అవకాశం ఉంటుంది. పోలైన ఓట్లను అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి లెక్కించి, విజేతను ప్రకటిస్తారు. మార్చి 25 లోగా ఎన్నికలను పూర్తి చేస్తారు.

నవీన్ కుమార్ కు రెన్యువల్..? కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఎవరికి..?
ఎమ్మెల్యే కోటాలో తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల జరగనున్నాయి. ఇక తెలంగాణలో ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్, నవీన్ కుమార్ ల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. తెలంగాణలో ఖాళీ అవుతోన్న మూడు స్థానాలకు అధికార బీఆర్ఎస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. సంఖ్యా పరంగా చూస్తే మూడు స్థానాలు బీఆర్ఎస్ కే దక్కే అవకాశాలు ఉన్నాయి. ఆశావాహుల సంఖ్య భారీగా ఉన్న నేపథ్యంలో, సీఎం చంద్రశేఖర్ రావు ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తిగా మారింది.

మిత్రపక్షంలో భాగంగా సీపిఐకి ఓ స్థానం.. డిసైడ్ చేయనున్న సీఎం
కాగా ఖాళీ అవుతున్న మూడు స్థానాల్లో నవీన్ కుమార్ కు మళ్లీ అదే పదవిని పునరుద్దరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గంగాధర్ గౌడ్, కృష్ణ రెడ్డి స్ధానాల్లో మాత్రమే కొత్తవారికి అవకాశాలు దక్కనున్నట్టు ప్రగతి భవన్ వర్గాలు నిర్దారిస్తున్నాయి. రెండో అభ్యర్థి స్థానాన్ని సీపీఐతో స్నేహపూర్వకంగా కొనసాగుతున్నందుకు మాజీ సీపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు సీఎం చంద్రశేఖర్ రావు సుముఖంగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది. మిగిలిన మూడో అభ్యర్థి ఎవరిని ఎంపిక చేస్తారన్న అంశంపై మాత్రం ఉత్కంఠ రేగుతోంది.

మోత్కుపల్లికి ఛాన్స్ ఇవ్వనున్న సీఎం.. కొనసాగుతున్న ఆసక్తి..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులలో రెండు స్థానాలపై ఆసక్తి తారా స్తాయిలో ఉన్నప్పటికి మూడో స్థానంపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఆశావహుల సంఖ్య కూడా చాంతాడంత కనిపిస్తోంది. వీరిలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామారెడ్డి, సీఎం ఓఎస్డీగా పనిచేస్తున్న దేశపతి శ్రీనివాస్, నల్లగొండ జిల్లాకు చెందిన నేతలు చాడ కిషన్‌రెడ్డి, బిక్షమయ్యగౌడ్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ నేత బండి రమేశ్, సీనియర్ నేత పీఎల్ శ్రీనివాస్, వరంగల్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌తోపాటు వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అరికెల నర్సారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications