బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మహారాష్ట్ర ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్ తిరుగుపయనం అయిన క్రమంలో.. ఎదురుగా వచ్చిన ఓ లారీ ఆయన కారుపైకి తీసుకొచ్చింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో రాజాసింగ్‌కు ప్రమాదం తప్పింది.
ఆదివారం సాయంత్రం ఔరంగాబాద్‌లో జరిగిన ఓ బహిరంగసభకు ఆయన హాజరయ్యారు. సభ అనంతరం అర్థరాత్రి హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. ఔరంగాబాద్ నుంచి 30కి.మీ ప్రయాణించగానే మార్గమధ్యలో ఈ సంఘటన జరిగింది.

రాజాసింగ్ కారు డ్రైవర్ అప్రమత్తతో ఆయన ప్రమాదం నుంచి బయటపడగా.. వారి వెనకాలే వస్తున్న కారును లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్నవారికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం.కాగా, ఇది ఉధ్దేశపూర్వకంగా జరిగిన కుట్ర అని రాజాసింగ్ ఆరోపించడం గమనార్హం.
ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ పరార్ అవగా.. క్లీనర్ ను పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న రాజాసింగ్.. ఉద్దేశపూర్వకంగానే లారీతో తన కారును ఢీకొట్టడానికి ప్రయత్నించారని ఆరోపించారు. డ్రైవర్ అప్రమత్తత వల్లే ప్రమాదం నుంచి బయటపడ్డామని చెప్పారు.












Click it and Unblock the Notifications