బీజేపీలో బీసీలకు చోటు లేదు.. ఇది కిషన్‌రెడ్డి రాజ్యం - రాజాసింగ్
తెలంగాణలో రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా.. ఆయన మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నిక జరగనుంది. కాగా లేటెస్ట్ గా బీజేపీ ఆదిష్టానం అభ్యర్థిని ప్రకటించింది. లంకల దీపక్‌రెడ్డిని అభ్యర్ధిగా ఖరారు చేస్తూ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీలో బీసీలకు చోటు లేదు..
ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కిషన్ రెడ్డి రాజ్యం కిషన్ రెడ్డి రాజ్య అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ నినాదం చేశారు. తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడల్లా.. ప్రముఖ నాయకుడు వచ్చినప్పుడల్లా.. భవిష్యత్తులో ఒక బీసీ తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతాడని అందరూ అంటారన్నారు. కానీ రాష్ట్రంలో ఉప ఎన్నికలు కానీ వస్తే బీసీలనే మర్చిపోతారని ఫైర్ అయ్యారు. బీసీలు తెలంగాణ బీజేపీలో ఎక్కడున్నారో చెప్తారా అని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.

గతంలో తానెప్పుడూ ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు లేదా ఓబీసీల గురించి మాట్లాడలేదని.. హిందూత్వం గురించి మాత్రమే మాట్లాడానని గుర్తు చేశారు. కానీ ఈమొదటిసారి ఇలా మాట్లాడటానికి కారణం ఉందని స్పష్టం చేశారు. ప్రతి ఎన్నికల్లో బీసీ కార్డును ప్లే చేసి.. బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నారని చెప్పారు. ఇక బీజేపీ నుంచి పోటీలో ఉన్న లంకల దీపక్ రెడ్డికి అభినందనలు తెలిపారు. లంకల దీపక్‌రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 2023 ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, భారత రాష్ట్ర సమితి తరఫున సునీత బరిలో నిలిచారు. నవంబర్ 11వ తేదీన ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగనుంది. ఈ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.
మరోవైపు తెలంగాణలో శాసనసభ్యుల మరణం తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో సానుభూతి పెద్దగా వర్కవుట్ అయినట్లు కనిపించట్లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014 తర్వాత జరిగిన అయిదు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపించిందని చెబుతున్నారు. అయిదుసార్లు ఉప ఎన్నికలు జరిగితే నాలుగు సార్లు మరణించిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఓటమి పాలయ్యారని జోష్యం చెప్తున్నారు. దాంతో ఈసారి ఏం జరగనుందని రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ నడుస్తోంది.
-
BJP అధికారంలోకి వస్తే 'చేపల' నిషేధం! దీదీకి స్ట్రాంగ్ కౌంటర్ -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications