చంపుతామంటూ బెదిరింపు కాల్స్: డీజీపీకి ఎమ్మెల్యే రాజా సింగ్ లేఖ
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌కు లేఖ రాశారు. తనకు చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజా సింగ్ తన లేఖలో పేర్కొన్నారు.
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌కు లేఖ రాశారు. తనకు చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజా సింగ్ తన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు తనకు ఏ ఏ నెంబర్ల నుంచి కాల్స్ వచ్చాయో.. ఆ జాబితాను డీజీపీకి రాసిన లేఖలో వివరించారు.
తనను చంపుతామంటూ పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఇప్పటికే ఎమ్మెల్యే రాజా సింగ్ ట్విట్టర్ వేదిక ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 'నన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇవాళ సాయంత్రం 3.34 గంటలకు బెదిరింపు కాల్ వచ్చింది. పాకిస్థానీ వాట్సాప్ కాల్ ద్వారా చంపుతామంటున్నారు. తమస్లీపర్ సెల్స్ యాక్టివ్‌గా ఉన్నాయన్నారు. ప్రతి రోజు ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి' అని రాజా సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సీపీలను రాజా సింగ్ తన ట్వీట్‌కు ట్యాగ్ చేశారు. గతంలో కూడా రాజా సింగ్ కు ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం గమనార్హం.

ఇది ఇలావుంటే. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చాలంటూ ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు రాజా సింగ్. పాత వాహనం కావడంతో తరచూ మొరాయిస్తుందని వాపోయారు. ఇటీవల ఎమ్మెల్యే రాజా సింగ్‌కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం టైర్ ఊడిపోయింది.
రాజా సింగ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఇంటికి వెళ్తుండగా.. ధూల్‌పేట ఎక్సైజ్ ఆఫీస్ ముందు బుల్లెట్ ప్రూఫ్ వాహనం టైర్ ఊడిపోయింది. స్పీడ్ తక్కువగా ఉండటంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇప్పటికే చాలా సార్లు రాజా సింగ్ కు ఇచ్చిన ఈ వాహనం నడిరోడ్డుపై ఆగిపోయింది. ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చి కొత్తది కేటాయించాలని రాజా సింగ్ పలుమార్లు ప్రభుత్వానికి, పోలీసు ఉన్నతాధికారులకు విన్నవించారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని రాజా సింగ్ వాపోయారు.












Click it and Unblock the Notifications