బుల్డోజర్లు ఉన్నాయి జాగ్రత్త.. ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు!!
వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే వ్యక్తి కోసం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. గతంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయన పై అనేక కేసులు నమోదు కాగా జైలుకు కూడా వెళ్లారు. రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనను బిజెపి పార్టీ నుండి సస్పెండ్ చేసింది.
తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మళ్ళీ మాటల దాడిని పెంచిన రాజాసింగ్ తాజాగా సీఎం కేసీఆర్ , మంత్రి కేటీ ఆర్ పైన తనదైన శైలిలో మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. మంగళ హాట్ లో నిర్మిస్తున్న డబల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో ఆయన మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కొత్తగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ధూల్ పేట లో గుడుంబా వృత్తిని మానేసిన వారికి ఇవ్వాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. ఒక్క ఇల్లు వేరే వాళ్లకు ఇచ్చినా తమ వద్ద బుల్ డోజర్లు ఉన్నాయని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని రాజాసింగ్ హెచ్చరికలు జారీ చేశారు.ఎమ్మెల్యేగా తాను చెప్పిన వారికి తప్ప మరెవరికీ ఇళ్ళు ఇవ్వటానికి వీలు లేదన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో తాను అనేకమార్లు కేసీఆర్ కు, కేటీఆర్ కు లేఖలు రాశానని చెప్పిన రాజా సింగ్ గుడుంబా వృత్తిని మానేసిన వారికి ఇవ్వకుండా, వేరే వాళ్లకు ఇల్లు ఇస్తే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.ధూల్ పేట లో తెలంగాణ ప్రభుత్వం 145 డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మిస్తుంది.
అక్కడ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని నేడు పరిశీలించిన ఎమ్మెల్యే రాజాసింగ్ అక్కడ ఉన్న పని వారిని పిలిచి పనులు వెంటనే ఆపాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకల్ ఎమ్మెల్యే వచ్చానని, కాంట్రాక్టర్ ఎవరు? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అంటూ అసహనం వ్యక్తం చేస్తున్న రాజాసింగ్ తన వద్దకు కాంట్రాక్టర్ రావాలంటూ హుకుం జారీ చేశారు.












Click it and Unblock the Notifications