BRS తో మా వాళ్లు ఎప్పుడో కలిసేవారు, అక్కడే ఆగింది..!!
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కవిత వరుసగా చేస్తు న్న వ్యాఖ్యలతో బీఆర్ఎస్ లో కలకలం మొదలైంది. కేటీఆర్ లక్ష్యంగా కవిత చేస్తున్న కామెంట్స్ ఆ పార్టీని ఇరకాటంలోకి నెడుతున్నాయి . బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు సిద్దం అయ్యారంటూ కవిత చేసిన కామెంట్స్ తో కేసీఆర్ ఆత్మరక్షణలో పడ్డారు. ఇప్పుడు ఇదే వ్యాఖ్యల పైన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఆసక్తి కర అంశాలు వెల్లడించారు.
బీఆర్ఎస్ నేత కవిత సంచలన వ్యాఖ్యలు చేసారు. తాను జైల్లో ఉన్న సమయంలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం గురించి చర్చ జరిగిందని.. తాను వ్యతిరేకించానని చెప్పుకొచ్చారు. బీజేపీలో విలీనానికి తాను అడ్డుగా ఉన్నాననే కేసీఆర్ కి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇప్పుడు ఇదే వ్యాఖ్యల పైన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనంపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు నిజమే అని అనుకుంటు న్నానని చెప్పారు.పెద్ద ప్యాకేజీ దొరికితే తమ వాళ్లు (బీజేపీ) కూడా ఎప్పుడో బీజేపీని బీఆర్‌ఎస్‌లో కలిపేసేవారంటూ మరో సంచలనానికి తెర తీసారు.

బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసిపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేయాలని అనుకుంటే ఎక్కడి నుంచి నిలబడాలి అనేది కూడా బీఆర్‌ఎస్ వాళ్లే డిసైడ్ చేస్తారన్నారు. గతంలో కూడా ఇదే జరి గిందని అందుకే బీజేపీ నష్టపోయిందని అన్నారు. ఎప్పుడో బీజేపీ ప్రభుత్వం రావాల్సి ఉందని.. కానీ బీజేపీ ప్రభుత్వం ఎందుకు రాలేదో ఒకసారి ఆలోచన చేయాలన్నారు. ప్రతీ ఎన్నికల్లో తమ పార్టీ నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. దీని వల్ల బీజేపీ చాలా నష్టపోయిందంటూ వ్యాఖ్య లు చేశారు. ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఈ విషయం తెలుసని.. అయినా ఎవరూ బయటపడరని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకు వెళ్తే సస్పెండ్ చేస్తారనే భయంతో కార్యకర్తలు ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు రాజాసింగ్ సొంత పార్టీ పైన చేసిన ఈ వ్యాఖ్యల పై పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications