
కేసీఆర్‌తో కలిసి సీతక్క: వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటన, చర్చ
వర్షం.. వరద తగ్గడం లేదు. తెలంగాణలో వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. భారీ వర్షాల వల్ల గోదావరి పరీవాహక ప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. పరిశీలనకు బయలుదేరిన సీఎం కేసీఆర్... భద్రాచలం, ములుగు, ఏటూరు నాగారం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. సీఎం కేసీఆర్ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
సీఎం కేసీఆర్‌తో ఏటూరు నాగారంలో వరద ప్రాంతాలను సీతక్క పరిశీలించారు. వరద నష్టంపై కేసీఆర్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజీకి చేరిన సంగతి తెలిసిందే. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యాక ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది.

టీఆర్ఎస్ పాలనపై రేవంత్ రెడ్డితోపాటు సీతక్క కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో తన నియోజకవర్గ పరిధిలోని వరద ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన కేసీఆర్‌తో కలిసి సీతక్క ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. దీంతో మంచి సంకేతాలను ఇచ్చారా అనే సందేహాం కలుగుతుంది. అయితే విమర్శలు, విమర్శలే.. పర్యటన.. పర్యటన అని కొందరు అంటున్నారు.
భద్రాచలంలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. చాలా ఏళ్ల తర్వాత వరదలు వచ్చాయి. భద్రాచలం, పినపాక నియోజకవర్గాలు చాలా దెబ్బతిన్నాయి. పోలీసు, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ దళాలు తక్షణమే సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కొత్తగూడెం, ఖమ్మం కలెక్టర్లు గొప్పగా పని చేసి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నందుకు వారిని ప్రత్యేకంగా సీఎం అభినందించారు.