ఇక తప్పదు, పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా - బై పోల్స్..!?
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు. జూబ్లీహిల్స్ ఫలితం తరువాత అనూహ్య నిర్ణయాలు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల పైన నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ కు సుప్రీం సూచనలు చేసింది. నిర్దేశిత సమయం ముగియటంతో ఈ రోజు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో, ఇప్పటికే వీరి విషయంలో విచారణ చేస్తున్న స్పీకర్... తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా, వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయక తప్పదని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక. .వీరి రాజీనామాకు ముహూర్తం.. బై పోల్స్ పైనే అధికార పార్టీలో చర్చ సాగుతోంది.
బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఇద్దరి పైన పూర్తి ఆధారాలు ఉండటం తో వీరి పైన ప్రస్తుతం అధికార పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్,స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తర్వలో రాజీనామా చేస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇద్దరి పైనా ఆధారాలు ఉండటంతో.. స్పీకర్ చర్య తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుందనే విశ్లేషణలు ఉన్నాయి. న్యాయ నిపుణుల సూచనల మేరకు ఈ ఇద్దరూ రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విచారణకు రావాలని స్పీకర్ నోటీసులు పంపినా.. వీళ్లిద్దరూ విచారణకు హాజరు కాలేదు. దీంతో అప్రమత్తమైన ఇద్దరు స్పీకర్ నిర్ణ యం కంటే ముందే రాజీనామా చేస్తే హుందాగా ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్టు పార్టీ నేతల సమాచారం. ఇదే జరిగితే రాష్ట్రంలో మరో రెండు అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా, బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ కు పది మంది ఎమ్మెల్యేలు దగ్గరయ్యారు. తమ పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఈ 10 ఎమ్మెల్యేలపై ఫిరాయింపు చట్టాన్ని ప్రయోగించి అనర్హులుగా ప్రకటించాలని బీఆర్‌ఎస్ పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. చర్యలు తీసుకోడానికి స్పీకర్ వెనకాముందాడటంతో బీఆర్‌ఎస్ తొలుత హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీఆర్‌ఎస్ పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది జూలై 31న సుప్రీంకోర్టు ఆదేశిం చింది. సుప్రీం ఆదేశాల మేరకు ఈ ఏడాది అక్టోబర్ 31లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. వీరిలో కడియం శ్రీహరి, దానం నాగేందర్ మినహా మిగతా 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ విచారణకు హాజరయ్యారు. రెండు విడతల్లో 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. అనంతరం స్పీకర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా, ఈ రోజు సుప్రీంకోర్టులో ధిక్కారణ పిటీషన్ పైన విచారణ జరిగింది. రోజు వారీ విచారణ దిశగా సీజేఐ సూచన చేసారు. నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేస్తామని అసెంబ్లీ తరపు న్యాయవాదులు స్పష్టం చేసారు. అయితే, బీఆర్‌ఎస్ గుర్తు మీద ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరిన అనంతరం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కారు గుర్తు మీద స్టేషన్ ఘన్‌పూర్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి, సీఎం రేవంత్ సమక్షంలో పార్టీలో చేరారు.

తన కూతురు కడియం కావ్యకు కాంగ్రెస్ నుంచి హనుమకొండ పార్లమెంట్ నియోజకవర్గం టికెట్ ఇప్పించుకొని ఆమె కోసం పని చేశారు. కాంగ్రెస్ జెండాలు పట్టు కొని బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిని ఓడించాలని ప్రచారం చేశారు. పక్కా ఆధారాలతో దొరికిపోయిన ఈ ఇద్దరిపై వేటు తప్పదని ప్రచారం సాగుతోంది. దీంతో వేటు కంటే రాజీనామా బెటర్ అని ఇద్దరూ ఆలోచిస్తున్నట్టు తెలిసింది. అయితే రాజీనామా ఎప్పుడు చేయాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ఇద్దరు రాజీనామా చేస్తే.. వచ్చే ఉప ఎన్నికలకు సమాయత్తం పైనా ఆలోచన తరువాత ఫైనల్ నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications