ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారం: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భద్రత పెంచిన తెలంగాణా సర్కార్!!
తెలంగాణాలో ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారం ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారంలో బీజేపీకి చెందిన పెద్దవాళ్ళు ఉన్నారన్న వార్తలు జోరందుకున్నాయి. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫాం హౌస్ లో జరిగిన చర్చ మినిట్ టూ మినిట్ రికార్డ్ అయ్యిందని, పూర్తి ఆధారాలు ఉన్నాయని ఈ కేసులో బీజేపీ ఇరుక్కోవటం పక్కా అన్న చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో మొత్తం ఆపరేషన్ లో కీలక వ్యక్తి అయిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భద్రతను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పైలెట్ రోహిత్ రెడ్డికి భద్రత పెంపు
ఈ నేపధ్యంలో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి 4 ప్లస్ 4 గన్ మెన్లను కేటాయిస్తూ రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు పైలెట్ రోహిత్ రెడ్డికి బులెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా కేటాయించింది. ప్రస్తుతం రోహిత్ రెడ్డి 2 ప్లస్ 2 భద్రతను కలిగి ఉన్నారు. మొయినాబాద్ ఫాం హౌస్ ఘటన నేపధ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా బయటకు వచ్చిన రెండు ఆడియో లీకులలో పైలెట్ రోహిత్ రెడ్డితో జరిపిన సంభాషణలే ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఆడియోల విషయంలో పోలీసులు ఇప్పటివరకు స్పందించలేదు. ఈ ఆడియోలు నిజమైనవా? కాదా ? అన్నది ఇంకా ధ్రువీకరించలేదు.

కేసులో బీజేపీ కీలక నాయకులు.. అందుకే రోహిత్ రెడ్డికి అదనపు భద్రత
ఇదిలా ఉంటే బీజేపీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్ల రూపాయలు ఇచ్చి ట్రాప్ చెయ్యాలని ప్రయత్నం చేస్తే పైలెట్ రోహిత్ రెడ్డి ప్లాన్ తో బీజేపీ నే ట్రాప్ లో పడింది అన్న చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే పైలెట్ రోహిత్ రెడ్డికి అదనపు భద్రత ఇస్తున్నారు తెలంగాణా పోలీసులు. ఇక ఈ కేసులో పలువురు ముఖ్య నాయకుల పేర్లు తెర మీదకు రావటంతో పైలెట్ రోహిత్ రెడ్డి ఈ కేసులో కీలకంగా మారారు. అందుకే ప్రభుత్వం పైలెట్ రోహిత్ రెడ్డికి అదనపు భద్రత కల్పిస్తుంది.

ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారంపై ఆసక్తి
కాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు , పైలెట్ రోహిత్ రెడ్డిలు పార్టీ మారిది డబ్బులు, కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభపెట్టి పార్టీ మార్చటానికి ప్రయత్నం చేశారని ఫిర్యాదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో ఈ కేసులో అనేక కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసును తెలంగాణా ప్రభుత్వం విదిచిపెట్టేలా లేదు. దీంతో ఈ కేసులో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ ఉత్పన్నం అవుతుంది.












Click it and Unblock the Notifications