Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో అనూహ్య పరిణామం, ఇక ఫిక్స్..!!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో ఆసక్తి కర అంశాలు చోటు చేసుకుంటున్నాయి. సుప్రీం ఆదేశాల తరువాత స్పీకర్ తన కార్యాచరణ వేగవంతం చేసారు. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. వారు తాజాగా స్పీకర్ నోటీసులకు తమ సమాధానం ఇచ్చారు. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు. ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో మాత్రం కొంత సస్పెన్స్ కొనసాగుతోంది. దీంతో.. ఇప్పుడు స్పీకర్ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది రాజకీయం గా ఉత్కంఠ పెంచుతోంది.

స్పీకర్ జారీ చేసిన ఫిరాయింపు నోటీసులకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సమాధానం ఇచ్చారు. తాము బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నామని స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశామని ఈ మేరకు సభాపతి నోటీసులకు సమాధానం ఇచ్చారు. అయితే కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ మాత్రం మరింత గడువు కావాలని స్పీకర్‌ను కోరినట్లు సమాచారం.

MLAs respond in union to Assembly Speaker s notices here the details

ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా ఇచ్చిన వివరణలో పలు లీగల్‌ జడ్జిమెంట్లను కూడా ఉదహరించినట్లు తెలిసింది. ప్రధానంగా తాము పార్టీ మారలేదని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నామని, ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పినట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టు మూడు నెలల్లోగా వీరి పైన నిర్ణయం తీసుకోవాలని సూచించటంతో సభాపతి వీరి నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీచేశారు.

దీంతో, స్పీకర్‌ కార్యాలయం నుంచి నోటీసులు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేల్లో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అరెకపూడి గాంధీ, సంజయ్‌, గూడెం మహిపాల్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌కు లిఖితపూర్వకంగా సమాధానాలిచ్చారు.

MLAs respond in union to Assembly Speaker s notices here the details

కానీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ మాత్రం సమాధానాలివ్వడానికి తమకు మరికొంత సమయం కావాలని స్పీకర్‌ను కోరినట్లు సమాచారం. తాము ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని..బీఆర్​ఎస్ ​కు రాజీనామా చేయలేదని అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామని ఆ సందర్భంగా మర్యాదపూర్వకంగా కండువా కప్పారని వివరించినట్లు సమాచారం. పైగా అది కాంగ్రెస్‌ పార్టీ కండువా కాదని అని 8 మంది ఎమ్మెల్యేలు వేర్వేరుగా వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు వీరి సమాధానాల ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+