రెచ్చిపోతున్న కాంగ్రెస్: ప్రగల్భాలకి హెచ్చరిక.. జానా, జనవరి 1న సెలవు
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో గెలుపొందిన నేపథ్యంలో ఆ పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. గెలుపు ఉత్సాహం నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తెరాస ప్రభుత్వంపై బుధవారం విరుచుకుపడుతున్నారు.
నల్గొండ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, డికె అరుణ ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన పైన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేత జానా రెడ్డి కూడా తెరాస ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ద్వారా తెరాస ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పారని జానా రెడ్డి అన్నారు. ప్రగల్భాలు, ప్రలోభాలకు ఈ ఫలితాలు హెచ్చరిక అన్నారు.

అధికార, ధన బలంతో మహబూబ్‌నగర్‌లో తెరాస నెగ్గాలనుకుందని కాంగ్రెస్ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విజయం సాధించిన దామోదర్ రెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ప్రతినిధులు వాస్తమేంటో తెలుసుకుని కాంగ్రెస్‌కు విజయాన్ని అందించారన్నారు. విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్‌తో బండారు దత్తాత్రేయ భేటీ
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ బుధవారం కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్‌ను కలిశారు. తెలంగాణ తాజా పరిస్థితి పైన ఆయన వివరించారు. కరువు ప్రాంతాలకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
జనవరి 1న సెలవు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1వ తేదీన సెలవును ప్రకటించింది. జనవరి 1 నూతన అంగ్ల సంవత్సరం. కాగా, కెసిఆర్ దంపతులు బుధవారం మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్ దంపతులను కలిశారు. గవర్నర్ సతీమణి విమలా నరసింహన్‌కు వారు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications