వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్ఎస్ ఎమ్మెల్యే బెదిరింపు?: ఫోన్లో రికార్డ్ చేసిన ఎంపీటీసీ భర్త, ఇవే...

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఖమ్మం/హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని ఖమ్మం జిల్లాలోని ఓ మహిళా ఎంపీటీసీ భర్తను వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ బెదిరించినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

సదరు ఎమ్మెల్యే... ఎంపీటీసీ భర్తతో పలుమార్లు ఫోన్లో మాట్లాడారని, అందుకు సంబంధించిన ఆడియో టేపులు కలకలం రేపుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఎంపీటీసీ అయిన మీ భార్యను అధికార టిఆర్ఎస్ పార్టీలో చేర్పించాలని ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చారని అంటున్నారు.

ఆడియో టేపులు విడుదల

కొణిజెర్ల 2 ఎంపీటీసీ బి నాగలక్ష్మి. ఆమె భర్త బండారు సత్యనారాయణ. వీరు సీపీఎం నాయకులు. బండారు సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు... టిఆర్ఎస్ వైరా ఎమ్మెల్యే తనకు ఫోన్ చేసి, తన భార్యను ఆ పార్టీలో చేర్పించాలని చెప్పారని ఆరోపించారు.

MLC elections: Phone recording stings TRS MLA, heard luring CPM members

ఇందుకు సంబంధించి ఆయన చేసిన ఫోన్ కాల్‌ను తాను రికార్డ్ చేశానని, వాటిని మీడియా ముందు విడుదల చేస్తున్నానని ఆయన ఆడియో టేప్ చూపించారు. ఎమ్మెల్యే తీరు పైన తాము జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌కు మంగళవారం ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

ఎమ్మెల్యే బెదిరించిన ఫోన్ రికార్డులను వారికి అందజేస్తామని బండారు సత్యనారాయణ చెప్పారు. ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సెలర్లు టిఆర్ఎస్‌లో చేరారు. అందులో కొణిజెర్ల ఎంపీటీసి నాగలక్ష్మి కూడా ఉన్నారు.

అయితే, ఎమ్మెల్యే బెదిరించారని అందువల్లే చేరారని వామపక్ష నేతలు చెబుతున్నారు. సీఎం సమక్షంలో పార్టీలో చేరడానికి ముందు సత్యనారాయణతో మూడుసార్లు ఎమ్మెల్యే మదన్ లాల్ ఫోన్లో మాట్లాడాడని చెబుతున్నారు.

సమాచారం మేరకు... ఓ దాంట్లో... 'ఏం సత్యనారాయణ ఎక్కడ? అమ్మాయి ఎక్కడుంది? నీకేం అనుమానం వద్దు, వస్తున్నారు కదా! వచ్చిన తర్వాత మాట్లాడదాం, ఏం కష్టం ఉన్నా చెప్పుకో, డబ్బు కష్టం కానీ, పనులు కావాలన్నా చేస్తా' అని ఉంది.

మరో ఫోన్.. తాను ఆసుపత్రిలో ఉన్నానని ఎంపీటీసీ భర్త బండారు సత్యనారాయణ చెప్పారు. తన భార్యను ప్పకుండా తీసుకు వస్తానని ఎమ్మెల్యేకు చెప్పారు. ఆ తర్వాత హైదరాబాద్ సీఎం వద్దకు వెళ్లే ముందు మరోసారి ఫోన్ చేశారు. ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

దాంతో జ్వరం తగ్గలేదని జవాబిచ్చారు. దాంతో సదరు ప్రజాప్రతినిధి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. అందుకు రేపు వస్తామని సత్యనారయణ చెప్పారు. నువ్వు ఓటు వేయకుంటే ఎమ్మెల్యే పదవి పోదు, ఊడదు అంటూ ఎమ్మెల్యే మాటలు ముగించారు. ఈ మాటలను ఎంపీటీసీ భర్త ఫోన్లో రికార్డు చేశారు. ఆ రికార్డు ఆధాీరంగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. దీనిపై ఎమ్మెల్యే స్పందించవలసి ఉంది.

English summary
Purported audio tapes of TRS legislator B. Madanlal asking the husband of a local level leader not to stop his wife from joining the ruling party were released here on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X