Gorati Venkanna: గత ప్రభుత్వంపై గోరటి వెంకన్న సంచలన వ్యాఖ్యలు..!
గాయకుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న శాసనమండలిలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు బంధుపై కేసీఆర్ సర్కార్ ను కడిగిపారేశారు. భూ స్వాములకు రైతు బంధు ఇవ్వడం సరైన పద్ధతి కాదని చెప్పారు. 50 ఎకరాలున్నా.. 200 ఎకరాలున్నా వారికి కూడా రైతు బంధు ఇస్తున్నారని.. ఇది కరెక్ట్ కాదన్నారు. ఇప్పుడొచ్చిన కాంగ్రెస ప్రభుత్వమైనా 10 ఎకరాల లోపు వారికి రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వందల ఎకరాలున్న పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు, హీరోలు, హీరోయిన్లు, ఐఏఎస్, ఐపీఎస్ లకు రైతు బంధు ఎందుకని ప్రశ్నించారు. ఇలాంటి వారికి రైతు బంధు వద్దని గతంలోనే చెప్పినట్లు.. ఇప్పుడు కూడా అదే చెబుతున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రొఫెసర్లను , మేధావులను , ఐఏఎస్ లను అరెస్ట్ చేసిందని వెంకన్న గుర్తు చేశారు. హరగోపాల్ లాంటి వారి మీద కూడా ఉపా కేసు పెట్టడం సరికాదన్నారు.

అంతేకాకుండా గత ప్రభుత్వం కుల సంఘాలకు భవనలంటూ కులతత్వాన్ని ప్రోత్సహించిందని గోరటి వెంకన్న పేర్కొన్నారు. కేసీఆర్ లాంటి తత్వవేత్తకు ఎవరి ఇలాంటి సలహాలు ఇచ్చారో తెలియదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్రతిష్ట పాలుకావడానికి అధికారులే కారణమన్నారు. అధికారులు ఇష్టారీతిగా వ్యవహరించారని ఆరోపించారు. అయితే రైతు బంధుపై మొదటి నుంచి ఇలాంటి విమర్శలే వస్తున్నాయి. రైతు బంధు పరిమితి విధించాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.
అయినప్పటికీ కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదు. ఫలితంగా ఎన్నికల్లో ఓడిపోయింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధుపై పరిమితులు విధించాలని యోచిస్తోంది. ఐదు నుంచి 10 ఎకరాల లోపు వారికే రైతు బంధు ఇవ్వాలని భావిస్తోంది. అలాగే ఐటీ కట్టే వారికి, ప్రభుత్వం ఉద్యోగులకు రైతు బంధు కట్ చేయాలని యోచిస్తోంది. దీనిపై త్వరలోనే నిబంధనలు రూపొందించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications