Kavitha: సీతక్కను ఉప ముఖ్యమంత్రి చేయాలి.. కవిత డిమాండ్..
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను ఉప ముఖ్యమంత్రిని చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. సీతక్కకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. రేవంత్ రెడ్డి పాలన అనుభవరాహిత్యంగా ఉందన్నారు. తెలంగాణలో పాలన సరిగా లేదన్నారు. కవిత లిక్కర్ కేసుపై కూడా స్పందించారు. లిక్కర్ కేసు పెద్ద కేసు కాదన్నారు. కేసుపై తనకు పెద్దగా ఇంటరెస్ట్ లేదని చెప్పారు.
లిక్కర్ కేసు తమ లీగల్ బృందం చూస్తుందన్నారు. కాగా కవితకు లిక్కర్ కేసు సంబంధించి సీబీఐ నోటీసులు ఇచ్చింది. కానీ కవిత తాను విచారణకు హాజరుకాలేనని చెప్పారు. దీనిపై ఆమె సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. కవిత పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం జరుగుతుందన్నారు. జీవో 3తో మహిళలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు.

జీవో 3ని తక్షణమే ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. ఈ జీవోపై కోర్టులో అప్పీల్ కు వెళ్లాలన్నారు. ఇందిర పార్కులో నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఈ నెల 8న భారత జాగృతి ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌లో నిర్వహించే నిరసన ధర్నాకు అనుమతి ఇవ్వాలని కవిత కోరారు. బుధవారం డీజీపీ రవిగుప్తను ఫోన్ చేశారు. శాంతియుతంగానే నిరసన తెలుపుతామని చెప్పారు.












Click it and Unblock the Notifications