తెలంగాణాకూ ఛత్తీస్‌గఢ్ కూ పోలికా? తెలంగాణా రైతులపై కేంద్రం క్రూరత్వం: ఎమ్మెల్సీ కవిత ఫైర్
ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బిజెపి సర్కార్ పై విరుచుకుపడుతున్నారు తెలంగాణ టిఆర్ఎస్ నేతలు. బీజేపీ తీరును ప్రజా క్షేత్రంలో ఎండగట్టే పనిలో పడ్డారు. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చూపించే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో కేంద్రంపై వార్ ను మరింత ఉధృతం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. కెసీఆర్ ధాన్యం కొనుగోలు చేస్తామని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న ప్రకటనతో రైతుల నుండి మద్దతు వస్తుందని భావిస్తున్నారు.

బీజేపీ సర్కార్ పై ఎమ్మెల్సీ కవిత ఫైర్
కేంద్రంలోని బిజెపి సర్కార్ పై ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించిందని పేర్కొన్న కవిత, సీఎం కేసీఆర్ రైతుల నుండి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారని వెల్లడించారు. ఎన్ని పోరాటాలు చేసినా కేంద్రం తీరు మారలేదని, కేంద్రం మెడలు వంచేలా కెసీఆర్ సారధ్యంలో పోరాటం చేస్తామని వెల్లడించారు.

బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని అర్ధమైంది: ఎమ్మెల్సీ కవిత
భారతదేశంలోని వరిలో 40% పైగా తెలంగాణ ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్న ఎమ్మెల్సీ కవిత, 61 లక్షల మంది రైతులు వరిని ఉత్పత్తి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వారిని ఆదుకోవడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత మరియు ఆ మద్దతును పొందడం ప్రతి రాష్ట్రం హక్కు అని ఆమె పేర్కొన్నారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేసినా కొనుగోలు చెయ్యని బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని చాలా స్పష్టంగా అర్థమైందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

వరి రైతులపై కేంద్రం క్రూరంగా ప్రవర్తిస్తుంది
మన వరి రైతులను కేంద్రం క్రూరంగా వదిలిపెట్టిన విధానం, రైతులు మరియు ప్రభుత్వ మద్దతు అవసరమయ్యే ఇతర వర్గాల పట్ల వారి దృక్పథాన్ని తెలియజేస్తుందని కవిత స్పష్టం చేశారు. కేంద్రం కొనుగోలు చేసేందుకు నిరాకరించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారుని పేర్కొన్న కవిత తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వం అంటూ పేర్కొన్నారు.

చత్తీస్ గడ్ తో తెలంగాణా రాష్ట్రానికి పోలికా? కవిత మండిపాటు
3.5 లక్షల వరిసాగు చేసే రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌తో తెలంగాణాను పోల్చడానికి బిజెపి మరియు కాంగ్రెస్‌లు ప్రయత్నించాయని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. 3.5 లక్షల వరి సాగు చేసే చత్తీస్ఘడ్ రాష్ట్రం ఎక్కడ? 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసే తెలంగాణ రాష్ట్రం ఎక్కడ అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఇది యాపిల్ నారింజను పోల్చడం లాంటిదని పేర్కొన్న కవిత, ఇది వారి అజ్ఞానాన్ని బయట పెడుతుందని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications