MLC Kavitha: కవితకు మళ్ళీ నిరాశే.. వాదనలు అప్పుడు వింటానన్న హైకోర్టు!!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కష్టాలు తప్పటం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ కోసం విఫల యత్నాలు చేస్తున్నా బెయిల్ దొరికేలా కనిపించటం లేదు. బెయిల్ కోసం ఆమె కోర్టులను ఆశ్రయిస్తున్నా, కోర్టులలో ఆమెకు నిరాశే ఎదురవుతుంది. ఇక తాజాగా సీబీఐ, ఈడీ కేసులో బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో దరఖాస్తు చేసుకున్న కవిత బెయిల్ పిటీషన్ పై విచారణ మళ్ళీ వాయిదా పడింది.
గడువు కోరిన సీబీఐ, కౌంటర్ దాఖలు చేసిన ఈడీ
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసును, అవినీతి ఆరోపణలతో సిబిఐ కేసును ఎదుర్కొంటున్న, బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి సిబిఐ కౌంటర్ దాఖలు చేయడానికి గడువు కోరగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కౌంటర్ దాఖలు చేసింది.

సోమవారానికి బెయిల్ పిటీషన్ విచారణ వాయిదా
కవితకు బెయిల్ ఇవ్వవద్దని, అందుకు సంబంధించిన కారణాలను ప్రస్తావిస్తూ తాము దాఖలు చేసిన కౌంటర్ లో ఆమెకు బెయిల్ ఇవ్వద్దని పేర్కొంది. ఈ కేసులో వాదనలు వినిపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.ఇక ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
మే 27న కౌంటర్ దాఖలు చేస్తామన్న ఈడీ
ఆదివారం సాయంత్రం లోపు కౌంటర్ కి సంబంధించిన అన్ని వివరాలను కవిత న్యాయవాదికి ఇవ్వాలని హైకోర్టు ఈడిని ఆదేశించింది. సోమవారం దీనిపై విచారణ చేయనున్నట్టు కోర్టు పేర్కొంది.మరోవైపు కవిత బెయిల్ పిటిషన్ విషయంలో మే 27వ తేదీన సిబిఐ కౌంటర్ దాఖలు చేస్తామని పేర్కొంది. జూన్ 7వ తేదీన చార్జిషీటు దాఖలు చేయనున్నట్టు సిబిఐ కోర్టు దృష్టికి తీసుకు వెళ్ళింది.
సోమవారం కవిత వాదనలు, మంగళవారం ఈడీ, సీబీఐ వాదనలు
ఇక సోమవారం రెండు కేసులలో కవిత తరపున వాదనలు పూర్తి చేయాలని కోర్టు సూచించింది. మంగళవారం నాడు ఈడి, సిబిఐ వాదనలు వింటామని వెల్లడించింది. కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో రిలీఫ్ వస్తుందని భావిస్తే ఈరోజు కూడా కోర్టులో కవితకు నిరాశ తప్పలేదు.












Click it and Unblock the Notifications