ఈ చర్యతో ప్రతీపౌరుడి వెన్నులో వణుకు; జోక్యం చేసుకోండి: సీజేఐకు ఎమ్మెల్సీ కవిత లేఖ

బిల్కిస్ బానో అత్యాచారం హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న 11మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రకంపనలు చెలరేగిన విషయం తెలిసిందే. అనేకమంది ఈ విడుదల ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యవహారంలో తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ ఘటనపై తనదైన శైలిలో స్పందన తెలియజేశారు.

బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలపై ఎమ్మెల్సీ కవిత సీజేఐ కి లేఖ


బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషులుగా ఉన్న 11 మందికి గుజరాత్ ప్రభుత్వం చేసిన విడుదల ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు లేఖ రాశారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు. తాను బాధాతప్త హృదయంతో లేఖ రాస్తున్నానని పేర్కొన్న కల్వకుంట్ల కవిత సుప్రీం కోర్టు ఉత్తర్వుల ఆధారంగా వారి విడుదల పై అనర్హత విధించారని విజ్ఞప్తి చేశారు.

సీబీఐ కోర్టు శిక్ష విధించిన కేసులో దోషులను విడుదల చేసే అధికారం రాష్ట్రానికి లేదు

సీబీఐ కోర్టు శిక్ష విధించిన కేసులో దోషులను విడుదల చేసే అధికారం రాష్ట్రానికి లేదు

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 435 (1) (ఎ) కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత మాత్రమే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు దర్యాప్తు చేసిన కేసుల్లో రాష్ట్రాలు దోషులకు ఉపశమనం లేదా శిక్షను తగ్గించాలని ఆదేశించాలని సూచిస్తున్నాయని కవిత పేర్కొన్నారు. బిల్కిస్ బానో కేసు కూడా ఈ కేటగిరీ కిందకు వచ్చిందని, దానిని సీబీఐ దర్యాప్తు చేసిందని కవిత అన్నారు. సిబిఐ ప్రత్యేక కోర్టు వారికి శిక్ష విధించింది అని పేర్కొన్న ఎమ్మెల్సీ కవిత సిబిఐ దర్యాప్తు చేసిన కేసులో దోషులకు శిక్ష తగ్గించే అధికారం కానీ విడుదల చేసే అధికారం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు

ఈ విడుదలతో ప్రతీ పౌరుడి వెన్నులో వణుకు పుడుతుంది

ఈ విడుదలతో ప్రతీ పౌరుడి వెన్నులో వణుకు పుడుతుంది


స్వాతంత్ర దినోత్సవం నాడు శిక్ష పడిన రేపిస్టులు బయటకు రావడంతో ప్రతి పౌరుడి వెన్నులో వణుకు పుడుతోందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఈ కేసులో 11 మంది దోషుల విడుదల, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి జరిగిందా లేదా అనేది అస్పష్టంగా ఉంది అని ఆమె అన్నారు. గుజరాత్ ప్రభుత్వం రిమిషన్‌ను అనుసరిస్తే 11 మంది దోషులకు ఉపశమనం లభించేది కాదని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు. అత్యంత దారుణమైన అత్యాచారం జరిగినప్పుడు బిల్కిస్ బానో వయసు 21 సంవత్సరాలు అని, అప్పుడు ఆమె ఐదు నెలల గర్భవతి అని పేర్కొన్న ఎమ్మెల్సీ కవిత గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో బయటకు వచ్చిన రేపిస్టులకు పూలదండలు వేసి స్వాగతం చెప్పడాన్ని చూసి బాధితురాలు బానో మనసు ముక్కలై ఉంటుందని, కాబట్టి ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలని కవిత పేర్కొన్నారు.

చట్టాలపై ప్రజలు విశ్వాసం ఉంచేలా.. మానవత్వాన్ని కాపాడేలా నిర్ణయం తీసుకోండి

చట్టాలపై ప్రజలు విశ్వాసం ఉంచేలా.. మానవత్వాన్ని కాపాడేలా నిర్ణయం తీసుకోండి


"అత్యాచారం వంటి నేరాలు మన సామాజిక మనస్సాక్షిని కదిలిస్తాయని పేర్కొన్న ఎమ్మెల్సీ కవిత మన స్వాతంత్ర్య దినోత్సవం రోజున దోషులుగా తేలిన రేపిస్టులు స్వేచ్ఛగా బయటికి వెళ్లడాన్ని చూస్తుంటే, ప్రతి మహిళకు చట్టాలపై విశ్వాసం పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశం యొక్క న్యాయవ్యవస్థపై ప్రజలు విశ్వాసం ఉంచేలా, మానవత్వాన్ని కాపాడేలా, నిర్ణయం తీసుకోవాలని తాను సుప్రీంకోర్టును అభ్యర్థిస్తున్నట్టు ఎమ్మెల్సీ కవిత సీజేఐ ఎన్వి రమణ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

బిల్కిస్ బానో కేసు రేపిస్ట్ ల విడుదలపై మంత్రి కేటీఆర్ కూడా ఫైర్


కాగా, బిల్కిస్ బానో రేప్ దోషులకు క్షమాభిక్ష ప్రసాదించినందుకు గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వంపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తీవ్ర విమర్శలు గుప్పించారు. శుక్రవారం ట్విటర్‌లో మంత్రి "రాజకీయ పార్టీలు సాధారణంగా ఎన్నికల్లో గెలవడానికి అభివృద్ధి, భద్రత, సంక్షేమ పథకాలను వాగ్దానం చేస్తాయి. ఇప్పుడు రాజకీయ పార్టీల నాయకులు గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలపై రేపిస్ట్‌లు & కిల్లర్‌లను విడుదల చేస్తున్నారు అని మండిపడ్డారు. ఇక కర్మ బూమరాంగ్ అవుతుంది అంటూ తనదైన శైలిలో బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+