Kavitha: సీఎం కేసీఆర్‍తో ఎమ్మెల్సీ కవిత భేటీ.. ఏం మాట్లాడుకున్నారంటే..!
మద్యం కుంభకోణం కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ ఎమ్మెల్సీ కవిత పేరు ఉంది. దీంతో ఆమె బుధవారం తండ్రి సీఎం కేసీఆర్ తో ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. లిక్కర్ కేసులో ఈడీ చార్జిషీట్, అలాగే ఇటీవలి పరిణామాలు, సీబీఐ దర్యాప్తు విషయాలపై లీగల్ ఎక్స్ పర్ట్స్తో చర్చించనున్నట్లు సమాచారం.

శరత్ చంద్ర రెడ్డి
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇటీవల ఈడీ దాఖలు చేసిన ఛార్జీషీటులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు చేర్చింది. కవిత వాడిన పది మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని ఛార్జీషీటులో పేర్కొంది. కవితతోపాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, ముత్తం గౌతమ్, అరుణ్ రామ చంద్రపిళ్లై, అభిషేక్ రావు పేర్లను ఛార్జీషీటులో ఈడీ ప్రస్తావించింది. ఒబారాయ్ హోటల్ మాగుంట శ్రీనివాస్ రెడ్డి మీటింగ్ ఏర్పాటు చేసినట్టు ఈడీ విచారణలో తేలినట్లు పేర్కొంది. శరత్ చంద్ర రెడ్డి, అభిషేక్, బుచ్చిబాబు ఢిల్లీ ఒబారాయ్ హోటల్ సమీర్ మహేంద్రు కలిసినట్టు ఈడీ ఛార్జ్ షీట్‌లో వెల్లడించింది.

శ్రీనివాసులు రెడ్డి
ఈ సమావేశంలో కవిత కూడా ఉన్నట్లు వివరించింది. అంతేగాక, సమీర్ కంపెనీలో కవితకు 32 శాతం వాటా ఉందని.. మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కూడా ఈ కంపెనీలో వాటా ఉందని వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం వల్ల ఇండో స్పిరిట్ కంపెనీకి అక్రమంగా రూ.192.8 కోట్లు లాభం వచ్చిందని చార్జిషీట్ లో ఈడీ తెలిపింది. లిక్కర్ స్కాం కుట్ర ద్వారా సంపాదించిన ఈ ఆదాయంలో ఎక్కువ భాగం కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డికే పోయిందని పేర్కొంది.

సీబీఐ ప్రత్యేక కోర్టు
కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించి సమీర్ మహేంద్రుపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను పరిగణలోకి తీసుకున్నట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు తెలిపింది.మూడు వేలపేజీలతో కూడినమొదటి ఛార్జీషీటును ఈడీ నవంబర్ 26న దాఖలు చేసింది. ఛార్జిషీర్జి ట్లోని అం శాలను పరిశీలించిన కోర్టు వాటిని పరిగణలోకి తీసుకుంటున్నట్లు పేర్కొంది.

ఏడుగురిని నిందితులు
ఛార్జిషీట్‌లో ఈడీ పేర్కొ న్న నిందితులు.. సమీర్ మహేంద్రు, ఆయనకు చెందిన నాలుగు మద్యం సరఫరా తయారీ సంస్థలస్థకు సమన్లు జారీ చేసింది. ఛార్జిషీర్జి ట్లో పేర్కొ న్న అంశాలపై తమ అభిప్రాయాలను జనవరి 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో ఏడుగురిని నిందితులుగా చేరుస్తూ 10వేల పేజీలతో కూడిన సీబీఐ దాఖలు చేసిన మొదటి ఛార్జిషీట్ ను ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకుంటున్నట్టు తెలిపింది.












Click it and Unblock the Notifications