సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్సీ కవిత ఘాటు హెచ్చరిక!

యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల పైన, ఇళ్ల పైన దాడి చేసే వారిని హెచ్చరించిన కవిత పార్టీ కార్యాలయాల పైకి ఇళ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

కాంగ్రెస్ నాయకులను హెచ్చరించిన కవిత
60 లక్షల మంది సైనికులు ఉన్న కుటుంబం బిఆర్ఎస్ పార్టీ అని ఆమె పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి ఉండదని ఆమె పేర్కొన్నారు. ఖబడ్దార్ కాంగ్రెస్ నాయకులు.. జాగ్రత్తగా ఉండండి అంటూ కవిత వారిపైన తీవ్రంగా స్పందించారు.కాంగ్రెస్ పార్టీది దరిద్రపు సంస్కృతి అని మండిపడ్డారు.

MLC Kavitha serious warning to CM Revanth Reddy and Congress leaders

కాసుల కోసమే కాంగ్రెస్ ఆలోచన
రౌడీ మూకలను వేసుకొని పార్టీ కార్యాలయాల పైన దాడి చేసే కల్చర్ వారికుందన్నారు. ప్రజల కోసం పోరాటం చేసే సంస్కృతి తమదని, నిబద్దతతో, మాటలతో, విజ్ఞతతో తాము ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని వెల్లడించారు. ఇక మూసీ నది ప్రక్షాళన విషయంలో కూడా కాంగ్రెస్ నాయకులను తప్పు పట్టిన కవిత మూసీ నదిని ప్రక్షాళన చేయాలన్న కాంగ్రెస్ ఆలోచన కేవలం కాసుల కోసమే అన్నారు.

మూసీని కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకోవాలని చూస్తుంది
అసలు మూసీ సుందరీకరణకు కెసిఆర్ సంకల్పం తీసుకున్నారని గుర్తు చేశారు. ఎస్ టి పి లను ఏర్పాటు చేయడమే కాకుండా గోదావరి నదితో అనుసంధానం చేయాలని ఆయన అనుకున్నారని కవిత తెలిపారు. 31 ఎస్టిపిలను కేసీఆర్ హయాంలోనే ఏర్పాటు చేశారని చెప్పిన కవిత మూసీ నది ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ నాయకులు మూసిని ఏటీఎం లాగా తయారు చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.

మూసీ పేరుతో కోట్ల రూపాయలు ఢిల్లీ పంపే ప్లాన్ లో రేవంత్
కాంట్రాక్టర్ల కోసమే ఈ ప్రాజెక్టు చేపడుతున్నారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టులు మాత్రమే కాదు యాదాద్రిలో కేసీఆర్ మొదలు పెట్టిన పనులను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని కవిత డిమాండ్ చేశారు. మూసి ప్రక్షాళన పేరుతో కోట్లాది రూపాయలు దండుకొని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పంపించాలనే ప్రణాళిక వేశారని కవిత ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం నాశనం అవుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+