నేను కాపలాదారుడ్నే: ఈటెల, ఫెయిలైన ప్లాన్.. కెసిఆర్ అప్‌సెట్!
హైదరాబాద్: కాస్త వెసులుబాటు లభించగానే ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, సందేహం అవసరం లేదని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం చెప్పారు. బుధవారం రవీంద్ర భారతిలో టీఎన్జీవో డైరీ ఆవిష్కరణ సభలో ఈటెల మాట్లాడారు.
ప్రభుత్వానికి ఉద్యోగులు, ప్రజలు అందరూ సమానమన్నారు. ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న అమరుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తామన్నారు. సమర్థ రాజకీయ నాయకత్వం ఉంటేనే సమర్థ ప్రణాళికలను రూపొందించగలుగుతుందనే సత్యం ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా నిరూపణ అయిందన్నారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణకు ధీరోదాత్త నాయకత్వం లభించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఖజానాకు నేను కాపాలాదురుడ్ని అని ఈటెల వ్యాఖ్యానించారు. ప్రజావసరాల మేరకు నిధులను సర్దుబాటు చేసే బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లు చెప్పారు.
కాగా, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో 12 సీట్లకు గాను తెరాస 10 సీట్లు గెలుచుకుంది. అందులో 6 ఏకగ్రీవం. ఆరు స్థానాలకు ఎన్నికలు జరగగా.. నాలుగు స్థానాల్లో తెరాస గెలిచింది. రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రెండు స్థానాలు కోల్పోవడంపై కెసిఆర్ అప్ సెట్ అయ్యారని తెలుస్తోంది.
సమాచారం మేరకు మొదటి, రెండో ప్రాధాన్యత ఓటును టిఆర్ఎస్ నేతలు జగదీశ్వర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డిలకు వేయాలని సూచనలు అందాయి. అలాగే, ఇతర పార్టీల ఓట్లను కూడా రెండు, మూడో ప్రాధాన్యత ఓటుగా తెరాస అభ్యర్థులకు వేయాలని సూచించారు. కానీ అది ఫెయిల్ అయిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications